ఒత్తిడి, అధికంగా మొబైల్ ఫోన్‌ను వినియోగించడం, గంటలు తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేయడం, డిప్రెషన్, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కళ్ల కింద నలుపు ఏర్పడుతుంది.ఈ నలుపు చూపరులకు అసహ్యంగా కనిపించడమే కాదు అందాన్ని సైతం తగ్గిస్తుంది.
ఈ క్రమంలోనే కళ్ల కింద నలుపును పోగొట్టుకునేందుకు ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ క్రీమ్ ను కనుక వాడితే కళ్ల కింద ఎంత నలుపు ఉన్నా సరే వారం రోజుల్లో మాయం అవ్వడం ఖాయం.
మరి లేటెందుకు ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక మీడియం సైజు క్యారెట్ ను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.మరియు అర ఆంగుళం అల్లం ముక్కను పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్‌ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి.ఆపై మూడు టేబుల్ స్పూన్లు క్యారెట్ బనానా జింజర్ జ్యూస్ వేసుకోవాలి.మరియు వన్ టేబుల్ స్పూన్ పాలు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ సిద్ధం అయినట్టే.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను కళ్ల కింద జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజూ చేస్తే కళ్ల కింద నలుపు క్రమంగా మాయం అవుతుంది.