బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ అంటే అందరు చెప్పే ఒకే ఒక్క పేరు ఇనయా.మొదటి నుంచి దూకుడు ఆటతో ఆకట్టుకుంటున్న ఇనయా తన ఎటాకింగ్ మోడ్ తో హౌస్ మెట్స్ కి షాక్ ఇస్తుంది.అంతేనా తను చెప్పదలచుకున్నది ఎవరేమి అనుకున్న చెప్పేస్తుంది.సూర్య విషయంలో ఆమె ఆడిన డబుల్ గేమ్ తో ఆడియన్స్ ఆమె తో జాగ్రత్తగా ఉంటున్నా.టాస్క్ ల విషయంలో ఇనయాతో పోట్లాట తప్పట్లేదు.ఇక మండే జరిగిన నామినేషన్స్ లో లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఆమె చేసిన మిస్టేక్స్ గురించి చెప్పినా ఇనయా మాత్రం ఒప్పుకోలేదు.
ఎంత క్లారిటీగా చెప్పినా సరే నేనింతే నా ఆట ఇంతే అన్నట్టుగా మాట్లాడింది.అంతేకాదు హౌస్ లో ఉన్న వారంతా ఒక వైపు ఇనయా ఒక్కతే ఒకవైపు అనేలా ఆమె ఎవరి మాట వినలేదు.
వినదలచు లేదు.ఇనయా ఈ స్ట్రాటజీతో టాప్ 5 లో నిలవాలని చూస్తుంది.
కొందరేమో కానీ ఒక కేటగిరి వాళ్లైతే ఇనయా కి ఓట్లు వేస్తున్నారు.మరోపక్క ఇనయా ఇన్నాళ్లు ఫ్రెండ్ అనుకున్న ఫైమా తో కూడా గొడవ పడుతుంది.
నామినేషన్స్ లో వీరిద్దరి మధ్య గట్టి మాటల యుద్ధం జరిగింది.







