కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై ఈడీ సోదాలు…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి.ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే.
వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.కామినేని గ్రూప్‌పై బుధవారం ఉదయం నుండి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
కామినేని గ్రూప్ చైర్మన్,ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి.తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో సైతం సోదాలు జరుగుతున్నాయి.అలాగే మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
షామీర్‌పేటలోని మెడిసిటీ కళాశాలలో ఏరియా అధికారులు సోదాలు చేస్తున్నారు.అలాగే ఫిల్మ్ నగర్ లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై సోదాలు నిర్వహిస్తోంది.
ఈడీ అధికారులు రెండు టీమ్స్‌గా విడిపోయి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు.
నేడు బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు.
భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి.హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాలో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉంది.
ఇండియా లైఫ్‌స్టైల్ బెస్ట్ అంటున్న కెనడా ఎన్నారై.. కారణం తెలిస్తే అవాక్కవుతారు…