నల్గొండ జిల్లా:హాలియా వద్ద ప్రేమజంట ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డారు.సాగర్ కాలువలోకి దూకి బలవన్మరణానికి యత్నించడంతో గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
కాల్వలో దూకిన యువతీ యువకులను కాపాడేందుకు తాడును తీసుకువచ్చారు.తాడు సాయంతో యువతిని కాపాడారు.
యువకుణ్ని కాపాడేలోగా అతను నీటిప్రవాహంలో గల్లంతయ్యాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు.
యువకుడి కోసం ఈతగాళ్లను రంగంలోకి దింపారు.ఈ ప్రేమజంట పీఏపల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.