సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసే హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత ఏడాది నవీన్ పోలిశెట్టి నటించిన జాతి రత్నాలు సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేసిందో మనకు తెలిసిందే.
అనుదీప్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా కరోనా సమయంలో థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సుమారు 70 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఈ సినిమా ఎన్నో సినిమాలకు ధైర్యం నింపిందని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించిన నటుడు నవీన్ పోలిశెట్టి నటనకు గాను సైమా అవార్డు వరించింది.ఈ క్రమంలోనే బెస్ట్ యాక్టర్ (క్రిటిక్) అవార్డును నవీన్ పోలిశెట్టి అందుకున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ నేను హీరో అవుదాం అనుకుంటున్నాను అని చెబితే అలాంటి కలలు కనకు అంటూ చాలామంది తననే అవమానించారు.అయితే నేడు నా కల నిజమైంది అంటూ ఈయన వెల్లడించారు.
ఇలా బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని, అది కూడా అల్లు అర్జున్ రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక ఈ సినిమాకు సైమా అవార్డు రావడంతో నాలో మరింత స్ఫూర్తి పెరిగిందని ఇదే స్ఫూర్తితో మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తానని ఈయన వెల్లడించారు.ఇక ఈ అవార్డు రావడానికి కారణమైన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి సైమా అవార్డును అభిమానులకు అంకితం చేశారు.ఇక ఈయన తదుపరి సినిమాల విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఇందులో నటి అనుష్క శెట్టి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.







