చుండ్రు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారా.? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చుండ్రు మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా.? చుండ్రుతో బాగా విసిగిపోయారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే కేవలం ఒక్క వాష్ లోనే మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), మూడు రెబ్బలు వేపాకు, రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పదార్థాలను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం( Ginger ) తరుగు వేసి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో స్మూత్ క్రీమీ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో నాలుగు చుక్కలు నీమ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా చేస్తే చుండ్రు చాలా వరకు మాయం అవుతుంది.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు పూర్తిగా తొలగిపోవడమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా సైతం ఉంటుంది.చుండ్రు సమస్యతో మదన పడుతున్న వారికి ఈ రెమెడీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
కాబట్టి కచ్చితంగా ప్రయత్నించండి.