ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఆ బరువు తగ్గటానికి అనేక రకాలైన ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.
వ్యాయామం చేస్తూ పౌష్టిక ఆహారం తీసుకుంటూ తమ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే అధిక బరువు తగ్గటానికి బాగా సహాయపడతాయి.
ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.
చేపలు
సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన కొలస్ట్రాల్ ని కరిగించి కేలరీలు సరైన విధంగా ఖర్చు అయ్యేలా చూస్తాయి.దాంతో అధిక బరువు తగ్గుతారు.అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచుతాయి.అయితే చేపను ఉడికించి తింటేనే ఈ ప్రయోజనాలను పొందుతారు.
నిమ్మజాతి పండ్లు
ప్రతి రోజు విటమిన్ సి సమృద్ధిగా ఉండే ద్రాక్ష, నిమ్మ, నారింజ, టమాటా,జామ పండ్లను తినాలి.ఇవి శరీరంలో కొవ్వును కరిగిస్తాయి.కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.దాంతో తక్కువగా తింటాం.అప్పుడు బరువు తగ్గుతాం.
ఆకుపచ్చని కూరగాయలు
పాలకూర, కీర, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో కేలరీలు చాలా తక్కువగా ఉండి శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తాయి.ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వు శరీరంలో చేరకుండా చేస్తాయి.
పాప్ కార్న్
జంక్ పుడ్ తినేవారు పాప్ కార్న్ తింటే చాలా ఉపయోగం కనపడుతుంది.పాప్ కార్న్ఉండే పీచు పదార్ధం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వు శరీరంలో పేరుకోకుండా సహాయపడుతుంది.
అంతేకాక కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండుట వలన ఆకలి త్వరగా వేయదు.దాంతో తక్కువగా తింటాం.కాబట్టి అధిక బరువు తగ్గించుకోవటానికి సహాయపడుతుంది.