అధ్యక్ష పీఠం ఎక్కగానే విష్ణు కి మొదలైన అసలు టెన్షన్

మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఎన్నికల సమయంలో అటు ప్రకాశ్ రాజ్, ఇటు మంచు ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, నటి హేమ మంచు ప్యానెల్ సభ్యుడైన శివబాలాజీ చేయి కొరకడం ఇవన్నీ అప్పుడు సంచలనంగా మారాయి.

 Big Challenge To Maa President Vishnu , Maa , Vishnu, Vishnu Manchu , Movie Arti-TeluguStop.com

‘మా’ ఎన్నికలను చూసిన వారంతా నిజమైన పొలిటికల్ ఎలక్షన్స్‌గా అభివర్ణించారు.ఎంతో ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల ఫలితాల సమయంలో చివరకు మంచు ప్యానెల్ గెలుపొంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు నియామకం అయ్యారు.

అయితే, ‘మా’కు పర్మినెంట్ బల్డింగ్ కట్టిస్తాననే ప్రధాన హామీతో విష్ణు ఎన్నికల బరిలో దిగి ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద ఘన విజయం సాధించారు.విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కావొస్తు్న్న ‘మా’ బిల్డింగ్‌‌ను ఎప్పుడు ప్రారంభిస్తారని పలువరు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.మా బిల్డింగ్ కోసం రెండు, మూడు స్థలాలను ఇప్పటికే పరిశీలించినట్టు ఎన్నికల సమయంలో మంచు విష్ణు ప్రకటించారు.

ఆయన గెలుపునకు కూడా ‘మా’ సొంత భవనం హామీ బాగా పనిచేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే నెటిజన్లు మా కొత్త భవనానికి ఎప్పుడు భూమి చేస్తారని కామెంట్స్ పెడుతున్నారు.

Telugu Big Maa Vishnu, Hema, Maa, Artist, Prakash Raj, Shiva Balaji, Vishnu, Vis

సాధారణంగా ‘మా’ అధ్యక్షుడి పదవీకాలం రెండేళ్లు మాత్రమే.అందుకే వీలైనంత తొందరగా భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలంటున్నారు.ఇకపోతే మా ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రకాశ్ రాజ్, అతని ప్యానెల్ సభ్యులు ‘మా బిల్డింగ్’ విషయంలో మంచు విష్ణును ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తమ ప్యానల్ మేనిఫెస్టో హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.

ఇదివరకే మహిళా ఆర్టిస్టుల సేఫ్టీ కోసం ‘వుమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన చేయించారు.ఇందులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని.

సామాజిక ఉద్యమకారులు సునీతా కృష్ణన్ దీనికి గౌరవ సలహాదారుగా ఉండనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube