ఈ మధ్య కాలంలో హెల్తీగా, ఫిట్‌గా ఉండేందుకు.బరువు తగ్గేందుకు ప్రతి ఒక్కరూ రోజులో కొంత సేపైనా వ్యాయామం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది.రోజు రోజుకు ఎండలు మండి పోతున్నాయి.
భానుడు భగ భగలను.ప్రజలు విల విల మంటున్నారు.
ముఖ్యంగా వడ దెబ్బకు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.మరి ఇలాంటి సమయంలో వ్యాయామం చేయొచ్చా అంటే.
ఆరోగ్య నిపుణులు చెయ్యమనే చెబుతున్నారు.కానీ, వ్యాయామం చేసే వారు ఖచ్చితంగా కొన్ని టిప్స్ ను కూడా పాటించాలని సూచిస్తున్నారు.
మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.వేసవిలో వ్యాయామం చేయడం మాత్రమే ముఖ్యం కాదు.
ఏ సమయంలో చేస్తున్నామో కూడా ముఖ్యమే.వాతావరణం మరీ వేడి ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే సమ్మర్‌లో సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి తర్వాత వ్యాయామం చేస్తే ఉత్తమం.
వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాత నీరు తాగాలని అందరికీ తెలుసు.అయితే సమ్మర్‌లో నీరు మాత్రమే తాగితే సరిపోదు.ఎందు కంటే వ్యాయామాలు చేసినా, చేయకపోయినా బాడీలో వాటర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.
ఆ లాస్‌ను పూడ్చాలంటే వాటర్‌తో పాటు కొబ్బరి నీరు, పండ్ల రసాలు, గ్లూకోజ్, సబ్జా వాటర్, మజ్జిగ, లస్సీ వంటివి తీసుకుంటూ ఉండాలి.
అలాగే సమ్మర్‌లో గంటలు తరబడి కాకుండా.
ఇరవై, ముప్పై నిమిషాల మాత్రమే వ్యాయామాలు చేయాలి.అంత కంటే ఎక్కువ చేస్తే బాడీ డీ హైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
సమ్మర్‌లో వ్యాయామాలు చేసే టప్పుడు కొద్దిగా వదులుగా ఉండేవి.లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి.
ఇక ఈ సీజన్‌లో వ్యాయామాలు చేసేటప్పుడు తలనొప్పి, కళ్లు తిరగడం, అలసట, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.అలాంటి సమయంలో వ్యాయామం చేయడం మానేసి.
కాసేపు రెస్ట్ తీసుకోవాలి.ఇలా చేస్తే వెంటనే రికవర్ అవుతారు.