కే‌సి‌ఆర్ కు వ్యతిరేక పవనాలు.. దేనికి సూచన !

తెలంగాణలో రాబోయే ఎన్నికలతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందా ? ఈసారి బి‌ఆర్‌ఎస్ రావడం కష్టమేనా ? కే‌సి‌ఆర్ కు( CM KCR ) వ్యతిరేక గాలి విస్తోందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.గత రెదేళ్లలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 Opposite Winds To Kcr.. What Is The Indication, Kaleshwaram , Cm Kcr , Brs Par-TeluguStop.com

ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎరుడవుతున్నాయి.దానికి తోడు కే‌సి‌ఆర్ కుటుంబ పాలన అనే నినాదం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కే‌సి‌ఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ధరణి ద్వారా భూముల కబ్జా కు పాల్పడుతున్నారని ఇలా రకరకాల ఆరోపణలు కే‌సి‌ఆర్ పాలనను చుట్టూముట్టాయి.దానికి తోడు డిల్లీ లిక్కర్ స్కామ్ లో స్వయంగా సి‌ఎం కుమార్తె ఎమ్మెల్సీ కవితనే విచారణలు ఎదుర్కోవడంతో తెలంగాణ ప్రజల్లో ఎంతో కొంత కే‌సి‌ఆర్ పాలనపై వ్యతిరేక ప్రభావం చూపుతూ వచ్చింది.

Telugu Brs Mlas, Brs, Cm Kcr, Kaleshwaram, Narendra Modi, Ts, Womens-Politics

దీంతో బి‌ఆర్‌ఎస్ నుంచి ప్రజల దృష్టి మరలుతోందా అంటే అవుననే చెప్పాలా తప్పదు.దీనికి కారణం తెలంగాణలో ఏ మాత్రం బలం లేకున్నా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కసారిగా పుంజుకోవడం.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) విజయం తరువాత తెలంగాణలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.ఈ దూకుడుకు తగినట్లుగానే ఆ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి.

అధికార బి‌ఆర్‌ఎస్ నుంచి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించిన తరువాత చాలమంది అసంతృప్త నేతలు హస్తం గూటికి చేరారు.దానికి తోడు బి‌ఆర్‌ఎస్ తరువాత అధికారంలోకి రాగల సత్తా కాంగ్రెస్ కు ఉందని సర్వేలు కూడా చెబుతుండడంతో ఈసారి అధికార మార్పు జరగబోతుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Telugu Brs Mlas, Brs, Cm Kcr, Kaleshwaram, Narendra Modi, Ts, Womens-Politics

ఇదిలా ఉంచితే పార్లమెంట్ లో మహిళా బిల్లు( Womens Bill ) ఆమోదానికి అడుగులు పడుతుండడంతో ఇప్పటికే ప్రకటించిన బి‌ఆర్‌ఎస్ అభ్యర్థుల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది.ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే లిస్ట్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది.దీంతో చాలమంది నేతలు బి‌ఆర్‌ఎస్ ను విడేందుకు ఇప్పటినుంచే మార్గం వెట్టుకుంటున్నారట.దాదాపు 40 మంది బి‌ఆర్‌ఎస్ నేతలు కొత్త దారులు వేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మొత్తానికి ఎన్నికల ముందు జరుగుతున్నా ప్రతి పరిణామం కూడా కే‌సి‌ఆర్ వ్యతిరేక దిశగానే జరుగుతుండడంతో.ఈ పరిణామాలన్నీ ప్రభుత్వ మార్పుకు సూచన అనే భావనా వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ అతివాదులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube