రాజన్న సిరిసిల్ల జిల్లా: మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీయే లక్ష్యముగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.శనివారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్& జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కాస్మోటీక్స్ పంపిణీ చేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న గత ప్రభుత్వాలు విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని,10 సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వంలో కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచడం జరిగిందని అన్నారు.
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ లలో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు.
రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం లో కామన్ డైట్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని,మన ఇంట్లో పిల్లలకు ఏ విదంగా ఆహారం అందిస్తున్నామో, ప్రజా ప్రభుత్వంలో గురుకులల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందజేయడం జరుగుతుందని అన్నారు.
ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలు దాగివున్న ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సాహం అందించాలని అన్నారు .రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందన్నారు.ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తేవడం జరిగిందని గుణత్మకమైన విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు.త్వరలోనే 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు .
ప్రజా ప్రభుత్వoలో గురుకులాల్లోని పిల్లలను తమ ఇంటి పిల్లలుగా భావించి వారికి పౌస్టికారమైన ఆహారం నాణ్యమైన భోజనం అంద చేయడం జరుగుతుందని అన్నారు .విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహరం అందించాలని అన్నారు .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో గురుకులాల్లో 40 శాతం డైట్ చార్జీలు 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచామని అన్నారు.గతంలో మూడు నుంచి ఏడవ తరగతి వరకు రూ.950 డైట్ చార్జీలు ఉండగా, నేడు రూ.1330గా ,8 నుంచి 10 వ తరగతి వరకు రూ.1100 ఉండగా నేడు రూ.1540, ఇంటర్ నుండీ పీజీ వరకు రూ.1500 ఉండగా నేడు రూ.2100 ప్రభుత్వం పెంచిందని అన్నారు .
గతంలో ఉన్న కాస్మోటిక్ చార్జీలను మూడు నుంచి ఏడవ తరగతి వరకు కాస్మోటిక్ చార్జీలు 55 ఉండగా నేడు 175గా ,8 నుండీ 10 వ తరగతి వరకు 75 ఉండగా నేడు 275 కు పెంచడం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.