రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శనివారం గ్రామంలో బిజెపి జెండా ఎగురవేయడం జరిగిందన్నారు.తెలంగాణలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మరియు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో
ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అని అన్నారు అన్ని పార్లమెంటు నియోజకవర్గం బిజెపి అభ్యర్థికి ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తానే దేశంలో మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అవుతున్నారని తెలిపారు అనంతరం పార్టీ కార్యకర్త ఇంట్లో టిఫిన్ బైటక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పత్తిపాక శ్రీనివాస్ పత్తిపాక మల్లయ్య,పోంచెట్టి తిరుమల్ కోన రమేష్,దోంతుల అశోక్, దుర్శెట్టి రవి, లోకోజు సతీష్, దుర్శెట్టి రాజు, అల్లం శేఖర్,నగరం తిరుపతి గొల్లపల్లి సాయికృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.