మాధకద్రవ్యాల నిరోధమే లక్ష్యంగా జిలాల్లో "అంటి డ్రగ్ క్లబ్స్ " ఏర్పాటు.

జిల్లాలో ఉన్న పాఠశాలల్లో, కళాశాలల్లో ఒక టీచర్, 5 విద్యార్థులతో అంటి డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు.చెడు అలవాట్లను ప్రోత్సహించే వారికి దూరంగా ఉంటు డ్రగ్స్ వినియోగం,రవాణా నిరోదానికి ప్రతిఒక్కరు కృషీ చేయాలి.

 Establishment Of "anti-drug Clubs" In The Districts With The Objective-TeluguStop.com

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “అంటి డ్రగ్ క్లబ్స్ ” ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, బలగం సినిమా( Balagam ) డైరెక్టర్ యెల్దండి వేణు,హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య,ఆడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్.రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు మాధకద్రవ్యాల అవగాహన ర్యాలీలో విద్యార్ధులు,పోలీస్ సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,సినీ నటులు బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణు,హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య,అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్,పాల్గోని విద్యార్థులు,యువత డ్రగ్స్ కి దూరంగా ఉంది అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) మాట్లాడుతూ యువత,విద్యార్థులు డ్రగ్స్ లాంటి మత్తు పధార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

అని జిల్లాలో మాధకద్రవ్యాల నిర్ములనకు విన్నూత కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి సినీ హీరోలు రోడ్ మోడల్ గా ఉంటున్నారని అందుకే ఈ కార్యక్రమానికి బలగం సినిమా యాక్టర్స్ ని పిలవడం జరిగిందన్నారు.

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 8,9,10 తరగతి విద్యార్థులతో, ఒక టీచర్ తో అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్ధులతో ,టీచర్ “అంటి డ్రగ్ క్లబ్స్ ” ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వీరుకి ప్రతి నెల వివిధ కార్యక్రమలు నిర్వహిస్తూ తోటి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు ని విరికి అవార్డ్స్ ,రివార్డ్స్ మంత్రి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు.

మాధకద్రవ్యాల మత్తు లో యువత , విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారాని, జిల్లాలో మాధకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రంగం పనిచేస్తుందని గడిచిన 6 నెలల కాలంలో 17 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.గంజాయి కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్100 కి సమాచారం అందించాలన్నారు.

అలాగే డైరెక్టర్ యెల్దండి వేణు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,ఎలాంటి అలవాట్లకు లోను కాకుండా కష్టపడి ఉన్నత స్ధానంలో ఉన్న కబట్టే మేము అందరం మీ ముందు ఉన్నామని,మన స్నేహితులు కానీ, మన తోటి వారు కనినఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారికి మంచి చెప్పి మత్తు పధార్థాలకు దూరంగా ఉండేలా చూసే బాధ్యత మనందరి మీద ఉన్నదన్నారు.మాధకద్రవ్యాలాంటి చెత్త దగ్గరికి రనివ్వద్దు అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

మేము అందరం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ మా ఊరి సిరిసిల్ల పిల్లల కోసం యాంటీ డ్రగ్ మీద పోరాటం చేస్తున్నామని అనగానే ఇక్కడికి వచ్చామని అన్నారు.

అలాగే సినీ నటుడు ప్రియదర్శి ( Priyadarshi )మాట్లాడుతూ మాధకద్రవ్యాలను ఆరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సినీ నటుడు ప్రియదర్శి పిలుపునిచ్చారు.

మాధకద్రవ్యాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.మాధకద్రవ్యాల వల్ల కలిగే ఆనార్ధాలను యువత , విద్యార్థులు గుర్తించాలని సూచించారు.

నేను కూడా సిగరెట్లు తాగేవాన్ని అని నేను మానేసి మూడు సంవత్సరాలు అవుతుంది అని ఇప్పుడు లైఫ్ ఎంతో సంతోషంగా ఉంది అని దీనికి కుటుంబం సభ్యులు కారణం అన్నారు.మన తల్లిదండ్రులు ,టీచర్స్, అధికారుల యెక్క సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడలన్నారు.

మాధకద్రవ్యాల నిర్ములన కోసం విన్నూత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్న జిల్లా పోలీస్ యంత్రగానికి ఇదే నా సెల్యూట్ అన్నారు.అనంతరం సినీ నటి కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ పోలీస్ జాబ్ అంటేనే ఎంతో బిజీ తో కుడినది అయినప్పటికీ పోలీస్ వారు మనకోసం సమయం కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో ఆవాహనకార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రతి పాటశాలల్లో, కళాశాలల్లో యాంటీ డ్రగ్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనియం అన్నారు.

అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో అంటి డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.తల్లిదండ్రులు, టీచర్స్ ఎప్పటికప్పుడు పిల్లల యెక్క ప్రవర్తన మీద దృష్టి పెట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్,సి.ఐ లు ఎస్.ఐ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube