రాజన్న సిరిసిల్ల జిల్లా : మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మరోసారిగా ఎంపీగా గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ అన్నారు.బుధవారం మల్యాల గ్రామంలోని పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో వివిధ కుల సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని మరోసారి గెలిపించాలని కోరారు .దేశంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేసుకోవాలని ఆయన అన్నారు.వీరి వెంట పత్తిపాక శ్రీనివాస్ ,లోకోజి సతీష్, దురిశెట్టి రాజు, పాటి సుధాకర్ , పంచెర్పుల దివ్యసాగర్, బొడ్డు కృష్ణ, ఎంజాల నరేష్ , గొల్లపల్లి సాయికృష్ణ,గోగులకొండ శివ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.