ఇల్లు చిరకాల స్వప్నం - అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లు అనేది ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం అని అర్హులైన ప్రతి వ్యక్తికి గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చు అని ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిల్లి రేణుక అధ్యక్షతన జరిగిన సమావేశంలో 452 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ ను అందజేశారు.

 Gruhalakshmi Scheme Proceedings Presented To 452 Members In Rajanna Siricilla, G-TeluguStop.com

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా శిథిలావస్థలో ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైనటువంటి గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ కాపీని అందజేయడం జరిగిందన్నారు.డబుల్ బెడ్ రూమ్ లు రానివారు ఎవరైనా ఉంటే గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అనంతరం జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.

ఇల్లు లేని నిరుపేదలకు గృహ లక్ష్మీ పథకం ద్వారా తమకు ఇష్టమైన రీతిలో ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చని అన్నారు.

అదేవిధంగా రానున్న శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం 24 గ్రామపంచాయతీలకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్, సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి, మామిండ్ల తిరుపతి, గీతాంజలి, ఎనగందుల అనసూయ, నాయకులు పందిర్ల పరశురామ్ గౌడ్, జబ్బర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube