సహకార సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి ..ఎమ్మెల్యే రవి శంకర్

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్( B.Vinod Kumar ) రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయిన్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కే డి సి సి బ్యాంక్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రవి శంకర్( Ravi Shankar ) లు హాజరయ్యారు.కె డి సి సి బ్యాంక్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని రాబోయే పదేళ్లలో సహకార సంఘాలు రాష్ట్రంలో పెద్దపీట వేస్తాయని అన్నారు.మంచి నాయకులతోనే సంఘాలు బలోపేతం అవుతాయని ఒకప్పుడు నష్టాల్లో ఉన్న నష్టాలలో ఉన్న కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ ఇప్పుడు చైర్మన్ కొండూరు రవీందర్రావు అధిక లాభాల బాటలో ఉన్నదని అన్నారు.

 Cm Kcr's Efforts To Strengthen Cooperative Societies Ravi Shankar , Rajanna Siri-TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, ఇంటికి పెద్దదిక్కుగా కెసిఆర్ మనల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు కోటి ఎకరాలకు నీరు అందించే విధంగా కాలేశ్వరం ప్రాజెక్టు ,పాలమూరు ప్రాజెక్టు నిర్మించారు అని అన్నారు.ద్వారా అన్ని గ్రామాలకు కాకతీయతో చెరువులు కుంటలు అభివృద్ధి జరిగి జలకళ సంతరించుకున్నాయని అన్నారు .రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ 5000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ అధికారిని ఏర్పాటు చేశామని రైతుల అభివృద్ధి కోసమే రైతు వేదికలు నిర్మించుకున్నామని తెలిపారు.రాబోయే కాలంలో రైతు వేదికలను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసి రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు .ఆధునిక సాంకేతికరణతో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు.

ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ కే డి సి సి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కాలేశ్వరం ప్రాజెక్టుతో పంటలు సమృద్ధిగా ఇవ్వండి రుణాలు తీసుకున్న రైతులు 100% రుణాలు చెల్లిస్తూ సహకార సంఘాలకు సహకరిస్తున్నారని అన్నారు.

టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ బోయిన్పల్లి బ్రాంచ్ ప్రారంభించిన తర్వాత 32 కోట్ల వ్యాపారం నడుస్తుందని ఏడు కోట్ల యాభై లక్షల డిపాజిట్లు బోయిన్పల్లి శాఖలో చేశారని ప్రస్తుతం 2100 ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారని తెలిపారు.బ్యాంకు కింద రెండు సహకార సంఘాలు ఉన్నాయని రైతులకు అన్ని రకాల రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో టేస్కబ్ ఉపాధ్యక్షులు ఉప్పిడి మోహన్ రావు, సి ఈ ఓ సత్యనారాయణ రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, రైతుబంధు( Rythu Bandhu ) సమితి అధ్యక్షులు లచ్చిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి,బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య,సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్,సింగల్ విండో చైర్మన్లు ముదుగంటి సురేందర్ రెడ్డి ,తీపి రెడ్డి కిషన్ రెడ్డి, జోగినపల్లి వెంకట రామారావు వేసిరెడ్డి దుర్గారెడ్డి, సాత్రాజుపల్లి సొసైటీ చైర్మన్ ఏనుగుతిరుపతి రెడ్డి, సర్పంచ్ గుంటి లతా శ్రీ ఎంపిటిసి సంబ బుచ్చమ్మ,నాయకులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube