రాజన్న సిరిసిల్ల జిల్లా:స్వచ్ఛభారత్(Swachh Bharat ) కార్యక్రమంలో భాగంగా శనివారం వేములవాడ కోర్టు పరిసరాలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి న్యాయవాదులు కోర్టు సిబ్బందితో కలిసి కోర్టు పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఎలాంటి వ్యాధులు రావని, కోర్టుకు ఎంతోమంది కేసుల నిమిత్తం రావడం జరుగుతుందని, వారు కోర్టు పరిసరాల్లోకి రావడంతోనే మంచి వాతావరణం కనిపించాలని చెత్తాచెదారాన్ని తొలగించడం జరిగిందని అన్నారు.
మెగా లోక్ అదాలత్
నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం వేములవాడ కోర్టులో 539 కేసులు పరిష్కార మయ్యాయని జూనియర్ సివిల్ జడ్జ్ కిరణ్మయి( Junior Civil Judge Kiranmai ) తెలిపారు.100 రాజీ కాబడిన కేసులను, 439 పిట్ కేసులను పరిష్కరించడం జరిగిందని, రాజీయే రాజా మార్గమని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, ఏపీపీ విక్రాంత్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, కిషోర్ రావు, నాగుల సంపత్, బొడ్డు ప్రశాంత్ కుమార్, గొంటి శంకర్, పంపరి శంకరయ్య, రేగుల రాజ్ కుమార్ ,బొజ్జ నరేష్ , నర్సింగరావు శ్రీనివాస్, నయము నాసారి , అన్నపూర్ణ ,పావని న్యాయవాదులు ఉన్నారు.