తాగునీరు సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడైనా తాగునీరు సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తాగునీరు సమస్యలపై వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వెల్లడించారు.

 Information Should Be Given If There Are Drinking Water Problems Collector Anura-TeluguStop.com

అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ఇంచార్జీగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.కంట్రోల్ రూం 24×7 పనిచేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

తాగునీరు సమస్య ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కు  9398684240 కాల్ చేయాలని సూచించారు.వారు సంబంధిత అధికారులకు తెలిపి సమస్య పరిష్కరిస్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube