ఓట్స్ తో ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మేకప్ లేకపోయినా మీ ముఖం మెరిసిపోతుంది!

ఓట్స్( Oats ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ఇటీవల కాలంలో ఓట్స్ వినియోగం భారీగా పెరిగిపోయింది.

 Follow This Simple Remedy To Make Your Face Glow Even Without Makeup!! Simple Re-TeluguStop.com

ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు మరియు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు ఓట్స్ ను తమ డైలీ డైట్ లో చేర్చుకుంటున్నారు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు ఓట్స్ లో ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగి ఉన్నాయి.

ముఖ్యంగా ఓట్స్ తో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మేకప్ లేకపోయినా మీ ముఖ చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకోవాలి.

అలాగే రెండు బాదం పప్పులు( Almonds ), హాఫ్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల ( rose petals )పొడి వేసుకొని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Simpleremedy, Face, Skin, Remedy, Oats, Oats Benefits, Oats Face Ma

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై మెల్లగా చర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఓట్స్ మీ చర్మాన్ని తేమగా మారుస్తుంది.ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

Telugu Tips, Simpleremedy, Face, Skin, Remedy, Oats, Oats Benefits, Oats Face Ma

ఓట్స్, బాదం, పెరుగు, తేనె మరియు గులాబీ రేకుల పొడి కొల్లాజెన్( Collagen ) ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతాయి.మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి.మరియు చర్మపు మంటను తగ్గిస్తాయి.ఫైన‌ల్ గా రెండు, మూడు రోజులకు ఒక‌సారి ఈ హోమ్ రెమెడీని పాటించడం వల్ల మేకప్ లేకపోయినా కూడా మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.

కాంతివంతంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube