2024లో కూడా స్త్రీలను అలా బూతులు తిడుతున్నారు.. చాందిని షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ( Celebrities ) నెగిటివిటీ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి.చిన్న చిన్న విషయాలకే సెలబ్రిటీలను దారుణంగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

 Chandini Chowdary Crucial Comments On Social Media Trolling Details, Chandini Ch-TeluguStop.com

సెలబ్రిటీలు కూడా ఈ ట్రోల్స్( Trolls ) నెగిటివ్ విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ అలా నెగటివ్ గా ట్రోల్స్ చేసే వారికి గట్టిగానే బుద్ధి చెబుతున్నారు.ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా స్పందిస్తున్నారు.

ఏమాత్రం వెనకాడకుండా తమ ఉద్దేశం ఏంటో కుండ బద్దలు కొట్టేలా చెప్పేస్తున్నారు.

అందులో భాగంగా తెలుగు అమ్మాయి, హీరోయిన్ చాందిని చౌదరి( Chandini Chowdary ) కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది.తనకి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందని ఆమె ఈ మేరకు పోస్ట్ చేసింది.అమ్మాయిల నుంచి తాము వినకూడని విషయాలు వింటున్న వెంటనే మగవాళ్ళందరూ వాళ్ళని లం* లేదా అలాంటి అర్థం వచ్చే పదాలతో అసభ్యంగా మాట్లాడుతున్నారు.2024 లో కూడా ఇలాంటి మాటలతో ఆడవాళ్ళని హింసిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది.అలాగే భయం వేస్తోంది.

ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది మొహం లేని, పేరు లేని వ్యక్తులు వాళ్లకు నచ్చని వాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యలు చేసే అవకాశం కల్పించింది.మన అమ్మల్ని తిడుతూ, చంపుతామని బెదిరిస్తూ అసలు ఏం చెబుదామనుకుంటున్నారు? తమ చుట్టూ ఇలాంటి వాళ్ళతో బతుకుతున్న ఆడవాళ్ళ గురించి( Women ) తలుచుకుంటేనే బాధ వేస్తోంది.సోషల్ మీడియాలోనే ఇంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు ఇళ్లల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియడం లేదు.ఈ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది అంటూ ఆమె రాసుకొచ్చింది.

చాలామంది ఆ పోస్ట్ పై పాజిటివ్ గా స్పందిస్తూ అలాంటివారికి గట్టిగా బుద్ధి చెప్పాలి మేడం అంటూ చాందినికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube