యూకే : భారతీయ విద్యార్ధుల పెద్దమనసు.. వీడియో గేమ్ ప్రాజెక్ట్ ఆదాయం స్వచ్ఛంద సంస్థలకి

భారత సంతతికి చెందిన విద్యార్ధి బృందం తన పెద్ద మనసు చాటుకుంది.వీడియో గేమ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారు యూకేలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు.

 Indian Student’s Video Game Project Donates Revenues To Uk Charities ,amir Al-TeluguStop.com

నార్త్ ఇంగ్లాండ్‌( Northern England )లోని షెఫీల్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న అమీర్ అలీ అనే విద్యార్ధి.‘‘ ప్రాజెక్ట్ పిక్సెల్ ’’ కో ఫౌండర్.

ఇది మొబైల్ కోసం 2డీ గేమ్‌లను సృష్టిస్తుంది.త్వరలోనే దీనిని యాపిల్ యాప్ సోర్ట్, గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఏడాది క్రితం ఇద్దరు స్నేహితుల ఆలోచనకు ప్రతిరూపమే ఈ ప్రాజెక్ట్.అంతేకాదు .ఇప్పుడు యూకేలోని ఏ యూనివర్సిటీలలోనైనా సరే విద్యార్ధుల నేతృత్వంలో అతిపెద్ద వీడియో గేమింగ్ కార్యక్రమాల్లో ఒకటిగా దీనిని అభివర్ణిస్తారు.ఈ సందర్భంగా అలీ( Amir Ali ) మాట్లాడుతూ.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు షెఫీల్డ్ యూనివర్సిటీలో అన్ని రకాల డిగ్రీ ప్రోగ్రామ్‌లపై చదువుతున్న ఎంతో మంది విద్యార్ధులు గేమింగ్ పట్ల మక్కువ కలిగి ఉన్నారని చెప్పారు.వీరిలో చాలామంది ఇండస్ట్రీలో పనిచేయాలని కోరుకుంటున్నారని తాము అనతికాలంలోనే కనుగొన్నామని , కానీ వారికి ఎక్కడ ప్రారంభించాలో తెలియదని అలీ తెలిపారు.

ప్రాజెక్ట్ పిక్సెల్ .గేమ్ డెవలప్‌మెంట్ గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు.ప్రాజెక్ట్ పిక్సె‌ల్‌లో చదువుకు, గేమ్ డెవలప్‌మెంట్ గురించి తెలుసా లేదా అనేది పట్టింపు లేదని.నేర్చుకోవాలనే తపన, అభిరుచి ఉంటే చాలని అలీ వెల్లడించారు.

Telugu Game, Amir Ali, Donates, Googlestore, Indian, Project Pixel, Revenues, Uk

ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, సైన్స్, సోషల్ సైన్సెస్‌ సహా వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌లకు చెందిన 25 మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో చేరారు.ప్రోగ్రామింగ్, సౌండ్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ డిజైన్, స్టోరీ రైటింగ్, క్యారెక్టర్ క్రియేషన్, మార్కెటింగ్ వరకు విద్యార్ధులకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.గేమింగ్ ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపాలని భావిస్తున్నామని ప్రాజెక్ట్ పిక్సెల్ వ్యవస్థాపకులలో ఒకరైన శ్రీలంక( Sri Lanka )కు చెందిన నజాజ్ నభన్ అన్నారు.గేమింగ్ అనేది చాలా మంది వ్యక్తుల జీవితంలో ఒక భాగమని.

అందుచేత స్వచ్ఛంద సంస్థ కోసం నిధులను సేకరించేందుకు దీనిని ఉపయోగించాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Telugu Game, Amir Ali, Donates, Googlestore, Indian, Project Pixel, Revenues, Uk

గేమింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దదని , మా ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్ధకు ఎందుకు విరాళంగా ఇవ్వకూడదనే దిశగా ఆలోచించామని నభన్ తెలిపారు.వీడియో గేమ్‌లను రూపొందించే విద్యార్ధులు చాలామంది ఉన్నారని .కానీ దాతృత్వం కోసం గేమ్‌లను తయారుచేసే ఈ స్థాయి బృందాన్ని తాము ఏ యూనివర్సిటీలోనూ చూడలేదని నభన్ చెప్పారు.ఈ టీమ్ ‘కలర్ డాష్’, ‘ ఫ్లైట్ ఫ్రెంజీ’ అనే రెండు గేమ్‌లను తయారుచేసింది.‘ టార్టెల్ ఒడెస్సీ ’, ‘చెఫ్స్ లాస్ట్ స్టాండ్ ’ మరో రెండు గేమ్‌లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube