మా గర్ల్ ఫ్రెండ్స్ ను ఇలాగే ఆట పట్టించేవాళ్లం.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇద్దరూ ప్రస్తుతం వరసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్, ఆనంద్.

 Vijay Deverakonda Says His Brother Voice Is Same As His Voice , Vijay Devarakoda-TeluguStop.com

విజయ్ దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ ( Family star )అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇకపోతే తాజాగా విజయ్ మూడు సినిమాలలో ప్రకటించారు.

Telugu Tollywood-Movie

ఇక ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమాతో( Gham Ganesha ) ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందీ.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఆనంద్ దేవరకొండ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనగా విజయ్‌ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించే వారో చెప్పి నవ్వులు పూయించారు.

Telugu Tollywood-Movie

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.మా ఇద్దరి వాయిస్‌ ఒకేలా ఉంటుంది.చిన్నప్పుడు మా అమ్మకు కూడా మాలో ఎవరు పిలిచారో అర్థమయ్యేది కాదు.

ఆ తర్వాత మా ఫ్రెండ్స్‌ను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆటపట్టించేవాళ్లం.నా మిత్రులు ఫోన్‌ చేస్తే ఆనంద్‌ మాట్లాడేవాడు.

వాళ్లు నేను మాట్లాడుతున్నా అనుకొనే వారు.కాలేజ్‌ డేస్‌లో ఇలా ఎక్కువగా ప్రాంక్‌ చేసేవాళ్లం.

నా సినిమాలో ఆనంద్‌తో డబ్బింగ్‌ చెప్పించాలని ప్రయత్నించాను అని తెలిపారు విజయ్ దేవరకొండ.అనంతరం గం.గం.గణేశా’ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.ట్రైలర్‌ చాలా బాగుందీ అని అభినందించారు.ప్రీ రిలీజ్‌కు రావాలనుందని.కానీ, వైజాగ్‌లో షూటింగ్‌ కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube