ఇళయరాజా( Ilayaraja ).ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈయన పేరు కూడా ఒకటి.
రాయల్టీ విషయంలో ఎక్కువగా ఈయన వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.తాజాగా కూడా ఆయన మరోసారి ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ( Isaignani, maestro )విషయంలో వార్తల్లో నిలిచాడు.
అయితే ఇప్పటికే చాలా సినిమాల మేకర్స్‌కు నోటీసులు పంపించిన ఆయన తాజాగా కాస్త ఆలస్యంగా మరో సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు నెలల క్రితం మలయాళం నుంచి వచ్చి ఇండియా వైడ్‌గా భారీ విజయాన్ని సాధించిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రంపై ఈ సారి సీరియస్ అయ్యారు.

గతంలో కమల్‌హసన్ హీరోగా గుణ సినిమా( Guna movie )వచ్చి పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఇళయరాజానే సంగీతం అందించగా ఈ చిత్రంలోని కమ్మని ఈ ప్రేమ లేఖ అనే పాట సౌత్ ఇండియా మొత్తం చాలా ఫేమస్ అయింది.ఇప్పటికీ చాలామందికి ఈ పాట ఫేవరేట్.అయితే ఈ పాటను నా దృష్టికి తీసుకురాకుండా, నా అనుమతి తీసుకోకుండా కాఫీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించి మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో( Manjummal Boys ) వాడుకున్నారంటూ ఇళయరాజా ఫైర్ అయ్యారు.
ఇప్పటికైనా సదరు మేకర్స్ నా అనుమతి తీసుకోవాలని, రాయల్టీ చెల్లించాలని లేకుంటే లీగల్‌గా చర్యలు తీసుకుంటానంటూ అ చిత్ర నిర్మాతలకు నోటీసు పంపించారు.అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

అయితే ఈ మధ్య రజనీకాంత్ కూలీ సహా ఒక నాలుగైదు సినిమాల విషయంలో ఇలాంటి కేసులోనే అయా చిత్ర నిర్మాతలకు ఇళయరాజా నోటీసులు పంపించడం విశేషం.వీటిలో ఒకటి రెండు కేసులు మద్రాస్ హైకోర్టుకు కూడా వెళ్లగా కోర్టు నిర్మాతలకు అనుగుణంగా తీర్పును ఇవ్వడం సంచలనంగా మారింది.ఇదిలా ఉండగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా నిర్మాణ సమయంలోనే సదరు గుణ అడియో కంపైనీ నుంచి అనుమతి తీసుకుని ఈ పాటను వాడుకున్నట్లు దర్శకుడు చిదంబరం ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు వెళుతుందీ, చివరికి తీర్పు ఎలా వస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.