వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న శ్యామల.. ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిందిగా!

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ( Rave Party ) టాలీవుడ్‌ సెలబ్రిటీలకు సమస్యలు తెచ్చిపెడుతోంది.ఇప్పటికే ఈ విషయంపై చాలామంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే.

 Tollywood Anchor Shyamala Responds False Allegations Her Details, Tollywood, Anc-TeluguStop.com

అందులో భాగంగానే శ్రీకాంత్ ( Srikanth ) హేమ ( Hema ) లాంటి వారు ఆ పార్టీకి వారు హాజరు కాలేదు అని క్లారిటీ ఇచ్చేశారు.వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.‍

అయితే ఇదిలా ఉండగా.ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.తాజాగా టాలీవుడ్ యాంకర్‌ శ్యామలపై( Anchor Shyamala ) కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు.

ఆమె రేవ్‌ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్‌ శ్యామల గట్టిగానే స్పందించింది.

తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపింది.ఇప్పటికే వారిపై పరువు నష్టం దావా( Defamation Case ) వేసినట్లు శ్యామల వెల్లడించింది.

కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది తీవ్ర స్థాయిలో మండి పడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే.అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది.

మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube