ఫోటో వైరల్: చెప్పుల షాపులో షాపింగ్ చేస్తూ మీటింగ్ అటెండ్ అయిన ఉద్యోగిని..

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్క పని సవాల్ తో కూడుకున్న విషయమే.ఇందులో భాగంగానే ఉద్యోగంలో ఉన్న కానీ.

 The Photo Went Viral. The Employee Attended The Meeting While Shopping In The Sh-TeluguStop.com

అది నిలబెట్టుకోవడం చాలా పెద్ద సమస్యగా మారిపోయింది.దీనికి కారణం ప్రతిరోజు ఏదో ఒక సమావేశం లేకపోతే, వీడియో కాన్ఫరెన్స్, జూమ్ కాల్స్ అంటూ ఇలా ఏదో ఒక మీటింగ్ అంటూ జీవితంలో మమేకమైపోయాయి.

వీటిలో ఏ దానికి హాజరు కాకపోయినా రిమార్క్ మనపై పడుతుంది.అందుకోసమే కాబోలు చాలామంది వేరే పనులు చేస్తున్న కానీ మీటింగ్లకు హాజరవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇదివరకు అనేకం చూసాం.

జర్నీలో ఉన్న కానీ, ఏదైనా శుభకార్యాలలో ఉన్న కానీ అలాంటి సమయంలో కూడా కంపెనీకి సంబంధించిన మీటింగ్స్ లలో పాల్గొనే వీడియోలు కూడా ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలాంటి సంఘటన తాజాగా బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

బెంగళూరు ( Bangalore )మహానగరంలోని ఓ చెప్పుల షాపులో ఓ మహిళ షాపింగ్ చేస్తూ( woman is shopping ) చేతిలో లాప్టాప్ పెట్టుకొని టీం మీటింగ్ కు హాజరయ్యింది.ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తుంది.ఈ ఫోటోకు సంబంధించి కార్తీక్ భాస్కర్ ( Karthik Bhaskar )అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫోటోను షేర్ చేయగా.అది కాస్త వైరల్ గా మారింది.

ఈ విషయం సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఇందుకు సంబంధించిన కామెంట్స్ చుస్తే కాస్త భిన్నంగా వెలబడుతున్నాయి.ఈ ఫోటోని చూసి చాలామంది తమాషాగా భావిస్తే.మరి కొందరు కాస్త విచారం వ్యక్తం చేస్తున్నారు.ఇది మల్టీ టాస్కింగ్ అని కొందరు కామెంట్ చేస్తుండగా.ఇలాంటి వారి వల్లనే ప్రస్తుతం అందరిని ఇంటి నుండి ఆఫీస్ కి వచ్చి పని చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే తాను ఆఫీసులో ఉండి విండో లేదా యాప్ లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ బండి వాటిలో షాపింగ్ చేస్తానని కామెంట్ చేస్తున్నారు.

ఇంకొక నెటిజన్ ఏకంగా ఆమె ఈ సమయంలో ఎవరు మీటింగ్ నిర్వహించారో వారిపై ఎలాంటి బూట్లను విసిరేయాలో అని ఆలోచిస్తుందంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube