ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వారం రోజుల తర్వాత తాడేపల్లి( Tadepalle )లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేయడం చర్చనీయాంశమైంది.హైకోర్ట్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కార్యాలయాన్ని కూల్చివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేత దిశగా అడుగులు పడ్డాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.సీఆర్డీయే అధికారులు నిబంధనలను పాటించకుండా ఈరోజు వేకువజాము నుంచే బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో శ్లాబ్ కు సిద్ధంగా ఉన్న వైసీపీ భవనాన్ని కుల్చివేశారు.
భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ఆ ప్రాంతానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ వెళ్లకుండా అధికారులు అడ్డుపడ్డారు.సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైసీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

హైకోర్టు( High Court ) చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని సీఆర్డీయే అధికారులకు సూచనలు చేయగా వైసీపీ న్యాయవాది ఇదే విషయాన్ని సీఆర్డీయే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని కూల్చడం కోర్టు ధిక్కరణ అని ఈ విషయాలను కచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతుండటం గమనార్హం.సీఎం జగన్ సైతం టీడీపీ కక్ష సాధింపు చర్యల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

వైసీపీ( ycp ) నేతలు మాత్రం జరుగుతున్న ఘటనల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ తరహా రాజకీయాలు సరికావని అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి ఘటనల వల్ల ఏపీ అభివృద్ధిపై సైతం ప్రభావం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయిస్తే కోర్టునుంచి ఎలాంటి తీర్పు వెలువడే అవకాశం ఉంటుందో చూడాల్సి ఉంది.
కోర్టులో వైసీపీకి కచ్చితంగా న్యాయం జరిగే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ టార్గెట్ గా ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.