అక్కడ రీల్స్ చేస్తూ సందడి చేసిన శివ జ్యోతి... బుద్దుందా అంటూ మండిపడిన నెటిజన్స్!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిపై పై సోషల్ మీడియా ప్రభావం ఉందని చెప్పాలి.సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేసుకుంటూ చాలామంది ఫేమస్ అవుతున్నారు.

 Netizens Trolls On Shiva Jyothi Dance Video At Hyderabad Outer Ring Road Details-TeluguStop.com

అయితే ఇలా ఫేమస్ అవడం కోసం చాలామంది రిస్క్ చేసి రీల్స్ చేస్తున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము.ఇలా రిస్క్ చేయడం వల్ల కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.

ఇలా వారు ఫేమస్ అవడం కోసం కొన్ని సార్లు కొంతమంది చేసే పనుల పట్ల నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.ఇక ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు ఇలాంటి పనులు చేయటం వల్ల ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

Telugu Anchorshiva, Hyderabad, Outer Road, Shiva Jyothi, Shivajyothi-Movie

ఈ క్రమంలోనే శివ జ్యోతి( Shiva Jyothi ) సైతం ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న శివ జ్యోతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఎన్నో వీడియోలను రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.అయితే తాజాగా ఈమె ఔటర్ రింగ్ రోడ్డు( Outer Ring Road ) పై రీల్స్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారడమే కాకుండా నేటిజన్స్ ట్రోల్ కి గురి అవుతుంది.

Telugu Anchorshiva, Hyderabad, Outer Road, Shiva Jyothi, Shivajyothi-Movie

సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్డు అంటే అక్కడ ప్రయాణించే వాహనాలకు ఏ విధమైనటువంటి స్పీడ్ లిమిట్ ఉండదు.చాలా వేగంగా వాహనాలు వెళుతూ ఉంటాయి.అలాంటి రోడ్డుపై  రీల్స్ చేయడం అంటే చాలా ప్రమాదమని చెప్పాలి.కానీ ఈమె ఔటర్ రింగ్ రోడ్డుపై రీల్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు మండిపడుతున్నారు.

బుద్ధుందా మీరు ఫేమస్ అవడం కోసం ఇలా ఔటర్ రింగ్ రోడ్డుపై రీల్స్ చేస్తారా మిమ్మల్ని చూసి ఎంతోమంది కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు.ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube