Skin Care : పైసా ఖర్చు లేకుండా చర్మాన్ని తెల్లగా మృదువుగా మార్చే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

చర్మాన్ని తెల్లగా, మృదువుగా మెరిపించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అటువంటి చర్మం కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

 A Magical Remedy To Make Skin White And Soft Is For You-TeluguStop.com

ఈ క్రమంలోనే రకరకాల స్కిన్ కేర్( Skin Care ) ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.అలాగే నెలకు ఒకసారి బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్, బ్లీచ్, టాన్ రిమూవింగ్ వంటివి చేయించుకుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా చర్మాన్ని తెల్లగా మృదువుగా మార్చుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న బీట్ రూట్( Beet Root ) తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Magicalremedy, Tips, Face Pack, Skin, Remedy, Latest, Magical Remedy, Ski

ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్( Milk Powder ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్( Rose Petals Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు మరియు సరిపడా బీట్ రూట్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మం సున్నితంగా రబ్ చేస్తూ శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

Telugu Magicalremedy, Tips, Face Pack, Skin, Remedy, Latest, Magical Remedy, Ski

చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు( Dead Skin Cells ) తొలగిపోతాయి.చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.అలాగే ఈ రెమెడీ చ‌ర్మాన్ని తేమ‌గా ఉంచుతుంది.

మృదువుగా, కోమలంగా మెరిపిస్తుంది.కాబట్టి తెల్లటి మృదువైన‌ మెరిసే చర్మాన్ని కోరుకునేవారు ఈ మ్యాజిక‌ల్ రెమెడీన‌ తప్పకుండా ట్రై చేయండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube