తెలంగాణ బీజేపీ( Telangana BJP ) నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.సాయంత్రం జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ( BJP Central Election Committee ) సమావేశానికి వీరు హాజరుకానున్నారు.
ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు హస్తినకు వెళ్లనున్నారు.రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై నేతలు పార్టీ అధిష్టానంతో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో సిట్టింగ్ స్థానాలను కలుపుకొని తొలి జాబితాలో ఆరు నుంచి ఏడు స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు లోక్ సభ స్థానాలను ఆశిస్తున్న పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ( Delhi )కి చేరుకున్నారు.