టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో మహేష్ విట్టా మంచి పేరును సంపాదించుకున్నారు.మహేష్ విట్టాకు బిగ్ బాస్ షో కూడా మంచి పేరును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.
థియేటర్లలో విడుదలైతే మాత్రమే ఓటీటీలు తీసుకుంటున్నాయని మహేష్ విట్టా వెల్లడించడం గమనార్హం.పెద్ద నిర్మాతలు తమ సినిమాలతో పాటు వాళ్ల బ్యానర్ లో తెరకెక్కిన చిన్న సినిమాలను సైతం అమ్మేస్తున్నారని మహేష్ విట్టా తెలిపారు.
నా పూర్తి పేరు విట్టా వెంకట మహేష్ బాబు అని ఆయన చెప్పుకొచ్చారు.మా నాన్న పేరు కృష్ణ అని నా పేరు మహేష్ బాబు( Mahesh Babu ) అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
కొంతమంది ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పాత్రలు చేస్తారని మహేష్ విట్టా పేర్కొన్నారు.మొదట క్లోజ్ అయ్యి పార్టీలు ఇచ్చి పాత్రలు అడుగుతారని ఆయన వెల్లడించడం గమనార్హం.

పెద్ద సినిమాలకు టైమ్ వేస్ట్ చేసుకోరని పాత్ర చెప్పి డేట్స్ ఇస్తారని మహేష్ విట్టా వెల్లడించారు.రెమ్యునరేషన్ పూర్తిగా ఎగ్గొట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.16 రోజులు నైట్ షూటింగ్ లో పాల్గొంటే పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వలేదని మహేష్ విట్టా తెలిపారు.రొమాంటిక్( Romantic ) అనే సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారని తర్వాత డబ్బులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

కొంతమంది అడిషన్ అని నాలుగుసార్లు తిప్పించుకొని వర్క్ షాప్ అని ఇబ్బంది పెట్టి ప్రొడ్యూసర్లను పట్టుకుంటారని మహేష్ విట్టా తెలిపారు.నా ఫస్ట్ రెమ్యునరేషన్ 200 రూపాయలు అని ఆయన వెల్లడించారు.నేనే రాజు నేనే మంత్రి( Nene Raju Nene Mantri ) సినిమాకు ఫ్రీగా చేశానని మహేష్ విట్టా పేర్కొన్నారు.మహేష్ విట్టా చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
మహేష్ విట్టా కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.