మంత్రి సీతక్క( Seethakka ) శుక్రవారం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు.తెలంగాణలో మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పేర్కొన్నారు.మంత్రి సీతక్క సచివాలయంలో రెండు క్యాంటీన్లను ప్రారంభించి సర్వపిండితో పాటు పలు వంటకాల రుచి చూడటం జరిగింది.
ఈ క్యాంటీన్ ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు.సోలార్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫోటోగ్రఫీ, మీసేవవాల వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేయడం జరిగింది.
చీఫ్ సెక్రటరీ శాంతకుమారి( CS Santha Kumari )తో కలిసి రాష్ట్ర సచివాలయంలో ఈ క్యాంటీన్ లు మంత్రి సీతక్క ప్రారంభించారు.ఈ క్రమంలో సచివాలయంలో సందర్శకులకు తెలిసేలా మంత్రుల పేషీల వద్ద మహిళా శక్తి క్యాంటీన్ ల అడ్రస్ తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించడం జరిగింది.ఇదిలా ఉంటే రెండేళ్లలో జిల్లాకు 5 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కలెక్టరేట్లు, ఆస్పత్రులు, దేవాలయాలు, బస్టాండ్ లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తుంది.