నా కెరీర్ కు నా ఫ్యామిలీనే అడ్డు పడుతోంది.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి మంచు లక్ష్మికి ( Manchu laxmi )మంచి గుర్తింపు ఉంది.మంచు లక్ష్మి మాట్లాడుతూ నా లైఫ్ కు, కెరీర్ కు నా కుటుంబమే అడ్డు పడిందని తెలిపారు.

 Manchu Laxmi Comments About Her Situation In Family Details Here Goes Viral , M-TeluguStop.com

మేమంతా కలిసే ఉంటామని అందుకని నా గురించి ఫ్యామిలీ ఎక్కువ శ్రద్ధ తీసుకునేదని మంచు లక్ష్మి పేర్కొన్నారు.హైదరాబాద్( Hyderabad ) దాటి ఎక్కడికి వెళ్తానని చెప్పినా అసలు ఒప్పుకునేవారు కాదని మంచు లక్ష్మి వెల్లడించడం గమనార్హం.

Telugu Hyderabad, Manchu Laxmi, Mohan Babu, Mumbai, Rana, Tollywood-Movie

నేను ముంబైకు వెళ్తానని చెప్పిన సమయంలో సైతం ఎన్నో అపోహలు, భయాలు సైతం కుటుంబాన్ని వెంటాడాయని మంచు లక్ష్మి పేర్కొన్నారు.అదొక పెద్ద చెరువులాంటిదని చిన్న చేపపిల్లలా నువ్వు ఈదగలవా అని భయపడ్డారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.ముంబైకు వచ్చిన కొత్తలో నేను రకుల్ ఇంట్లో ఉండేదానినని ఆమె అన్నారు.రకుల్ ఎప్పుడూ ముంబైకు వచ్చెయొచ్చుగా అంటూ ఉండేదని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

Telugu Hyderabad, Manchu Laxmi, Mohan Babu, Mumbai, Rana, Tollywood-Movie

హీరో రానా( Rana ) సైతం నువ్వు ఎల్లకాలం హైదరాబాద్ లో ఉండలేవని అనేవాడని నాకు కూడా కొత్తగా ట్రై చేయాలనిపించి ముంబైకు షిఫ్ట్ అయ్యానని మంచు లక్ష్మి అన్నారు.సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సిస్టర్స్ ను సినిమాల్లోకి తీసుకోవడానికి తెగ ఆలోచిస్తారని ఆమె తెలిపారు.నాన్నకు సైతం నేను యాక్టింగ్ కెరీర్ ను ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదని మంచు లక్ష్మి పేర్కొన్నారు.పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినేనని ఆమె చెప్పుకొచ్చారు.

నా తమ్ముళ్లు సులువుగా సాధించిన వాటిని పొందడానికి నేను ఎంతో కష్టపడ్డానని మంచు లక్ష్మి తెలిపారు.ఈ ధోరణి సౌత్ లోనే కాదు దేశమంతటా ఉందని మంచు లక్ష్మి కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోయిన్ మంచు లక్ష్మిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube