చిరంజీవి వల్ల బాగా ఏడ్చాను...ఆమని కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి ఆమని( Amani ) .ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

 Amani Interesting Comments On Chiranjeevi Details, Amani, Chiranjeevi, Tollywood-TeluguStop.com

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమని తన వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు రావడంతో తన భర్తకు దూరంగా ఉంటున్నారు.

ఇలా తన పిల్లలతో కలిసి ఉంటున్నటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Amani, Chiranjeevi, Nagma, Rikshavodu, Tollywood-Movie

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించారు.తాను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి మెగాస్టార్ చిరంజీవికి( Chiranjeevi ) అభిమానినని తెలిపారు.ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం చాలా ఎదురు చూశాను కానీ తనతో నటించే అవకాశం రాలేదని తెలిపారు.

ఇక నేను నా డ్రీమ్ సాంగ్స్ లో కనుక ఉంటే నా పక్కన కచ్చితంగా చిరంజీవి గారు ఉన్నట్లే ఊహించుకొనే దానిని.

Telugu Amani, Chiranjeevi, Nagma, Rikshavodu, Tollywood-Movie

ఇలా చిరంజీవి పక్కన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రిక్షావోడు సినిమాలో( Rikshavodu ) నాకు అవకాశం వచ్చింది.డేట్స్ అన్నీ కూడా ఫిక్స్ అయ్యాయి.షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది ఆ సమయంలోనే పేపర్లో ఈ సినిమాలో హీరోయిన్ నగ్మా( Heroine Nagma ) అని చదివి షాక్ అయ్యాను ఏమైందోనని ఎంక్వయిరీ చేయగా డైరెక్టర్ మారడంతో హీరోయిన్ ను కూడా మార్చేసారని తెలిసి షాక్ అయ్యానని తెలిపారు.

ఇకపోతే ఆయనతో నటించే అవకాశం వచ్చిన ఆయనకు చెల్లెలుగా నటించమని అవకాశం ఇచ్చారు.నేను నటించనని కరాకండిగా చెప్పేశాను.ఇప్పటికి కూడా ఆయనతో నటించే అవకాశం నాకు రాలేదు.ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా చాలా బాగా ఏడ్చేదాన్ని అంటూ చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆమని బయటపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube