వైరల్ వీడియో: రష్యన్ టూరిస్ట్ తో ఇంగ్లీషులో అదరగొట్టిన భారతీయ కాబ్లర్..

గత కొద్దికాలం నుండి అనేకమంది విదేశీ వీడియో బ్లాగర్స్ భారతదేశానికి సందర్శించి దేశంలోని ప్రజలతో సంభాషణలు చేస్తూ రోడ్డుపై దొరికే అనేక ఆహార పదార్థాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడం మనం ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా గమనిస్తూనే ఉన్నాం.ఇలా విదేశీయులు భారతదేశానికి వచ్చి దేశంలోని అనేక మందిని కలిసి వారి చేస్తున్న పనులకు సంబంధించిన విశేషాలు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే విశేషాల గురించి వీడియోలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Viral Video Of Indian Cobbler Talking To Russian Tourist In English, Viral Video-TeluguStop.com

ఇందులో భాగంగానే తాజాగా ఓ రష్యన్ మహిళ ఇన్ఫ్లుయెన్సర్ (Russian influencer)మరియా చిగురోవ భారతదేశ (Indian )పరిస్థితులను తెలుసుకునేందుకు ఇండియాకు వచ్చింది.తాజాగా ఈవిడ దేశంలోని ఓ చెప్పులు కుట్టే వ్యక్తితో జరిపిన వీడియోను ఇంస్టాగ్రామ్(Instagram) వేదికగా పంచుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోలో మారియ మొదటగా తన విరిగిపోయిన చెప్పులను చేతుల్లో పట్టుకోవడం కనపడుతుంది.ఆ తర్వాత ఆమె పక్కనే ఉన్న వికాస్ అనే చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్లి ‘చెప్పల్ టూత్ గయ‘ అని హిందీలో చెబుతుంది.దాంతో వెంటనే వికాస్ ఆమె చెప్పులను సరి చేయడం మొదలుపెడతాడు.

ఇక వికాస్ చెప్పులు కుట్టే సమయంలో ఆయన గురించి పేరు, అతడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నాడో లాంటి విశేషాలను అడిగి తెలుసుకుంటుంది మరియా.ఈ సంభాషణలో వికాస్(Vikas) తన పేరు చెబుతూ తాను 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని తెలిపాడు.

అయితే ఈ సంభాషణలో రష్యా అమ్మాయికి వికాస్ ఇంగ్లీష్ లోనే సమాధానం చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇక ఇలాంటి సేవలు దేశంలో లేవని హైలెట్ చేస్తుంది.ఇక తాను చేసిన పనికిగాను వికాస్ కేవలం 10 రూపాయలు అడగడంతో ఇంత తక్కువ అంటూ మరియా ఆశ్చర్యపోతుంది.దాంతో ఆవిడ ధన్యవాదాలు అంటూ హిందీలో కృతజ్ఞతలు తెలుపుతూ అతనికి 20 రూపాయలు ఇస్తుంది.

అలా వికాస్ తిరిగి పది రూపాయలు ఇవ్వబోతుంటే అవసరం లేదు ఉంచుకోండి అని మరియా తెలుపుతుంది.ఆ తర్వాత ఆవిడ తన చెప్పులను వేసుకొని ఆనందంగా గెంతులేస్తూ వెళుతుంది.

ఇక ఈ వీడియోకు మరియ తన అనుభవాన్ని వివరిస్తూ.నా స్లిప్పర్ కాబడిన వ్యక్తిని అందరూ గుర్తించండి.

అతని స్లిప్పర్ మరమ్మత్తు నైపుణ్యాలు చాలా పురాతనమైనది అయినా కానీ అతడు నా సూపర్ హీరోలలో ఒకరు ఉండొచ్చు అంటూ రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube