ఇటీవల వైసిపికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య( R Krishnaiah ) ను తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ లు తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నాయి.ఆర్ కృష్ణయ్య ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించాలని ఆ రెండు పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి.
వైసీపీ ఎంపీగా రాజీనామా చేస్తే కేంద్రంలో కీలక పదవి ఇస్తామని గతంలోని బిజెపి ఆఫర్ ఇచ్చింది .దీనికి తగ్గట్లుగానే ఆర్ కృష్ణ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.ఆర్ కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సమయంలో బిజెపి ముఖ్య నేతలతో సన్నిహితంగా మెలిగిన ఆర్ కృష్ణయ్య.
విద్యార్థి సంఘం నేతగా ఉన్న సమయం నుంచి బిజెపి అనుబంధ సంఘాలు, ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.తెలంగాణలో బీసీ సీఎం నినాదంతో బిజెపి మరింత పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బీసీ సీఎం నినాదాన్ని గట్టిగానే బిజెపి వినిపిస్తోంది. బీసీ సంఘాల నేతగా ఉన్న కృష్ణయ్య ( R Krishnaiah )ను దగ్గరికి తీసుకోవడం ద్వారా రాజకీయంగా మరింత పట్టు సాధించవచ్చని బిజెపి అంచనా వేస్తోంది.
దీనిలో భాగంగానే ఆర్ కృష్ణయ్య కు కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు బిజెపి సిద్ధమవుతూ ఉండగా, ఊహించని స్థాయిలో కాంగ్రెస్ నుంచి కూడా కృష్ణయ్య కు ఆఫర్ వచ్చిందట.
ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి( Mallu Ravi ) కృష్ణయ్యతో సమావేశం అయ్యారు .కాంగ్రెస్ లోకి రావాలని , తగిన స్థాయిలో ప్రాధాన్యం ఇస్తామని, కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చారట. ఇక బీసీ సంఘాల నుంచి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని కృష్ణయ్య పై ఒత్తిడి పెరుగుతోందట.
ఇదిలా ఉంటే కృష్ణయ్య బిజెపిలో చేరితే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఆయనకి ఈ బాధ్యత లు అప్పగిస్తే తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ పూర్తిగా బిజెపి వైపు టర్న్ అవుతుందని బిజెపి పెద్దలు లెక్కలు వేస్తున్నారట త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం
.