ప్రకాష్ రాజ్ నీకేం సంబంధం .. ? పవన్ తీవ్ర విమర్శలు 

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చినియాంశంగా మారగా , ఏపీలో రాజకీయ అలజడులకు కారణం అయ్యాయి.టిడిపి ,జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి వైసిపిని టార్గెట్ చేసుకుని ఈ వ్యవహారంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా,  వైసిపి కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతుంది.

అనేకమంది ప్రముఖులు ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు .సినీ నటుడు ప్రకాష్ రాజ్( Movie actor Prakash Raj ) సైతం తిరుమల లడ్డు వ్యవహారంపై స్పందించారు.  పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ.  మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది.  విచారించి నేరస్తులపై చర్య తీసుకోండి.

Telugu Janasena, Janasenani, Laddu, Pavan Kalyan, Prakash Raj, Prakashrajs, Telu

మీరు ఎందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు.మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు.  కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆయన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తీవ్ర విమర్శలు చేశారు.తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన నేపథ్యంలో,  ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.

  ఆ తరువాత మెట్లకు పసుపు రాసి,  కుంకుమ బొట్లు పెట్టారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ నిర్వహించారు.ఆ తర్వాత తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు.  హిందువుల గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏమిటని పవన్ ప్రశ్నించారు.

నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను.

Telugu Janasena, Janasenani, Laddu, Pavan Kalyan, Prakash Raj, Prakashrajs, Telu

ఇందులో ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏమిటి? నేను వేరొక మతాన్ని నిందించానా ?  ఇస్లాం క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా ?  తిరుమలలో అపవిత్రం జరిగింది .ఇలా జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుంది ?: తప్పు జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్చేదనం చేస్తే మాట్లాడొద్దా  ? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి.  ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు.

  ప్రకాష్ రాజ్ అంటే నాకు గౌరవం ఉంది.నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు.

  మాట్లాడితే సెక్యులరిజంకు విగాతం అంటే ఏమిటి అంటూ పవన్ ప్రశ్నించారు .సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.  ఇస్లాం మీద మీరు మాట్లాడగలరా ?  జీసస్ మీద మాట్లాడగలరా ?  ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫరెంట్ చేసుకోలేం నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదు అని పవన్ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube