బిగ్ బాస్ అందరి లెక్కలు సరి చేస్తోంది.ఒక వారం జరుగుతున్న కొద్ది చాలామందిలో టాలెంట్ బయటకు వస్తుంది.
అప్పటి వరకు ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్టు అనుకున్న వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు.ఇదే బిగ్ బాస్( Bigg Boss ) యొక్క మహిమ.
రియాలిటీ షో లలో ఇలాగే ఉంటుంది.అయితే ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ పెదవి విరిచిన మాట మనందరికీ తెలిసిందే.
చప్పగా సాగుతున్న సీజన్ లో ఎంతో కొంత టాలెంట్ మరియు కంటెంట్ ఉందనుకున్న బెబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడంతో ఇక ఇది చూసేవారు ఎవరు అని అనుకున్నారు అందరూ.అయితే ఎవరు ఊహించని విధంగా ప్రస్తుతం కొంతమంది ఆట తీరును బాగానే కనబరుస్తూ బిగ్ బాస్ పై ఆసక్తిని సృష్టిస్తున్నారు.
ఈ మూడు వారాల ఆట తీరును బట్టి కొంతమందిని టాప్ ఫైవ్ లో ఉంటారు అని మనం ఒక అంచనాకు రావచ్చు.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యష్ని( Yashmi ) గురించి.అసలు మొదటివారం, రెండో వారం ఆమె గురించి ఎవరికీ పెద్ద ఆసక్తి లేదు.ఉందా లేదా అన్నట్టుగానే హౌస్ లో కనిపిస్తూ ఉండేది.కానీ నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం తనలో ఆడ పులి బయటకు వస్తుంది.ఎవ్వరు సరిగా ఆడకపోయిన తనదైన రీతిలో నామినేషన్ పాయింట్స్ చెబుతూ ప్రత్యర్థులపై తన మాటల తూటాలను విసురుతుంది.
అంతలా తనదైన రీతిలో తోటి సభ్యులను ఆటను అంచనా వేయగలుగుతుంది.పైగా తాను కూడా బాగానే పాటిస్పేట్ చేసింది.
మొన్నటికి మొన్న ఎగ్స్ పోటీలో చాలా బాగా ఆడింది యష్ని.ఆమె తర్వాత నిఖిల్( Nikhil ) గురించి చెప్పుకోవచ్చు.
అతడు కూడా సోనియా మాయలో పడిపోయినట్టు అనిపించినా తిరిగి నీడ నుంచి బయటకు వచ్చాడు.ప్రస్తుతం తన ఆట తీరును తానే మెరుగుపరుచుకుంటూ వేగంగా దూసుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.
యూట్యూబర్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన నబిల్( Nabeel ) సైతం తనదైన ఆటతీరుతో చాలా బాగా ఆడుతూ ప్రత్యర్థుల కు సవాల్ విసురుతు పైకి చేరుకునే విధంగానే కనిపిస్తున్నాడు.ఈ మధ్యకాలంలో నబీల్ ఆట చాలా మెరుగయింది అని చెప్పుకోవచ్చు.ఇక పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా నైనిక( Nainika ) మొదటివారం నుంచి బాగానే ఆడుతుంది.ఇప్పుడు కూడా తన ఆడే తీరును చాలా చక్కగా కనబరుస్తుంది.
కచ్చితంగా నైనిక కూడా టాప్ ఫైవ్లోకి ఉంటుంది.ఇక విష్ణు ప్రియ లేదా సోనియా లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా టాప్ పైకి రీచ్ అవుతారు.
విష్ణు ప్రియ( Vishnu Priya ) తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంది.అలాగే ప్రేరణను రెచ్చగొట్టే విషయంలో కూడా సక్సెస్ అయ్యి బాగానే కనిపించింది.
సోనియా మొదటి వారం బాగా ఆడినట్టు అనిపించినా తర్వాత కాస్త తగ్గుతూ వస్తుంది.ఇదే అట తీరు కనిపిస్తే కష్టమే కానీ కొంచెం మెరుగైన కూడా ఆమె టాప్ ఫైవ్ లో ఉండడం ఖాయం.