యంగ్ టైగర్ ఎన్టీఆర్( Ntr ) ప్రస్తుతం దేవర( Devara ) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో హిందీ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్( Karan Johar ) కొనుగోలు చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల కరణ్ అలియా( Alia ) తో కలిసి ముంబైలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆలియా ఎంతో చక్కగా చుట్టూ మల్లే సాంగ్ తెలుగులో పాడి అందరిని ఆకట్టుకున్నారు.
ఇక ఈమె రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత రణబీర్ కపూర్ ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగులో విడుదల చేశారు ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.అయితే తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అలియా బయటపెట్టారు.
బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వెళ్లినప్పుడు తారక్ డిన్నర్ కు తన ఇంటికి ఆహ్వానించారు.అయితే ఆరోజు సాయంత్రం తారక్ ఇంట్లో చాలా సరదాగా హ్యాపీగా సాగిపోయిందని తెలిపారు.అయితే ఆ సమయంలో నేను 9 మంత్ ప్రెగ్నెంట్.అలా సరదాగా మాట్లాడుతూ పాప పుడితే ఏ పేరు పెట్టాలి బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అనే డిస్కషన్స్ జరిగాయి.
ఆ సమయంలో ఎన్టీఆర్ పాప పుడితే రాహా( Raha ) అని పేరు పెట్టమని చెప్పారని అలియా వెల్లడించారు.ఇక అలియా భట్ కు కూతురు పుట్టడంతో ఎన్టీఆర్ చెప్పిన పేరు పెట్టడంతో తన కూతురి విషయంలో ఎన్టీఆర్ కోరిక నెరవేరిందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
.