అందుకే నారాయణ మూర్తి ఎవరి సినిమాల్లో నటించడట

ఆర్ నారాయణ మూర్తి. తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు.

 Thats Why Narayana Murthy Not Interesting In Others Movies, Narayana Murthy, R N-TeluguStop.com

ఆయన నటుడే కాదు.దర్శకుడు, రచయిత కూడా.

పేద వారి కష్టాలనే తన సినిమాల కథ వస్తువులుగా మార్చుకుని అద్భుత సినిమాలు తెరకెక్కించాడు ఈ పీపుల్స్ స్టార్.తనే కథ రాసి, తనే దర్శకత్వం వహించి, తనే హీరోగా నటించి ఎన్నో ఆలోచనాత్మక సినిమాలను రూపొందించాడు నారాయణ మూర్తి.

ఆయన నటించిన తాజా చిత్రం రైతన్న కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపపడుతుంది.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల మూలంగా దేశ రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించాడు నారాయణ మూర్తి.

అయితే నారాయణ మూర్తికి ఓ ప్రత్యేక ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కె.విశ్వ‌నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన నేర‌ము-శిక్ష సినిమాతో జూనియ‌ర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టాడు ఆర్ నారాయణమూర్తి.ఆ తర్వాత దాస‌రి నారాయ‌ణ‌రావు తెరకెక్కించిన సంగీత సినిమాతో హీరోగా మారాడు.ఆ తర్వాత త‌నే హీరోగా న‌టిస్తూ, తనే దర్శకత్వం వహించిన సినిమా అర్ధ‌రాత్రి స్వ‌తంతం.

ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు నారాయణ మూర్తి.

రెండు దశాబ్దాల పాటు అద్భుత సినిమాలను తెరకెక్కించాడు.

Telugu Bhoo Poratam, Dandora, Vishwanath, Yana Murthy, Neramu Siksha, Raitanna-T

ఎర్ర‌సైన్యం, భూ పోరాటం, అడ‌వి దివిటీలు, దండోరా, చీమ‌ల దండు, ద‌ళం, చీక‌టి సూర్యులు, అడ‌వి బిడ్డ‌లు లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టాడు.ప్రజా సమస్యలను తన సినిమాల ద్వారా ఎలుగెత్తి చాటుతూ జనాల మనసులు దోచాడు నారాయణమూర్తి.

Telugu Bhoo Poratam, Dandora, Vishwanath, Yana Murthy, Neramu Siksha, Raitanna-T

అంతేకాదు.కెరీర్ తొలినాళ్లలో ఒకటి అర మినిహా మరే ఇతర దర్శకులు, నిర్మాతలు తీస్తున్న సినిమాల్లో ఆయన నటించలేదు.నటించాలని ఆఫర్లు వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు కూడా.

తన ధోరణిలోనే సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నాడు.ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాలకు అంత జనాదరణ లేకపోయినా.

తన పంథాను మాత్రం మార్చుకోవడం లేదు.ప్రజా సమస్యలను ఎలుగెత్తి పేరు తెచ్చుకున్న వాడిని అది అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు నారాయణమూర్తి.

అందుకే వేరే సినిమాల్లో నటించలేనంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube