యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమాపై( Devara ) ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతుండగా మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం తేలిపోనుంది.ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్( Netflix ) సొంతం కాగా 170 కోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఖర్చు చేసినట్టు సమాచారం అందుతోంది.
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో వస్తున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే దేవర సినిమా ఆలస్యంగానే ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
దేవర సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.దేవర మేకర్స్ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆలస్యంగా ఓటీటీలో( OTT ) స్ట్రీమింగ్ కావడం దేవర సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు.
దేవర1 సినిమా రిలీజ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర1 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.దేవర1 సినిమాపై ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతుండటం గమనార్హం.దేవర1 టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
దేవర1 మూవీలో అదిరిపోయే ట్విస్టులు సైతం ఉంటాయని తెలుస్తోంది.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబో సన్నివేశాలు స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.దేవర1 సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరో 36 గంటల్లో దేవర జాతకం తేలిపోనుంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఒకింత ఎక్కువగానే కష్టపడ్డారు.ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.