తెలుగులో ఆది పురుష్( Adipurush ) సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేశాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.( Saif Ali Khan ) చాలామంది బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియా పై కన్నేసిన నేపథ్యంలో సైఫ్ కూడా ఏమాత్రం తాను కూడా అతీతం కాదు అన్నట్టుగా ప్రభాస్ సినిమాతోనే రంగ ప్రవేశం చేశాడు కానీ ఇది తన మొదటి సినిమా అని మాత్రం చెప్పుకోలేకపోతున్నాడు అందుకు గల కారణం సినిమా సమయంలో వ్యవహరించిన విధానం అలాగే ఇప్పుడు దేవర సినిమా( Devara ) రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో చేస్తున్న ప్రమోషన్స్ అన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు తన డిబ్యూట్ మూవీ అంటే అది కేవలం దేవర అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అందుకు గల కారణం రావణుడిగా తనను ఎంత దారుణంగా ఓం రౌత్ చూపించాడో అతనికి బాగా అర్థమైంది కాబట్టి.
ఆ సినిమా మిగిల్చిన బాధను మర్చిపోవడానికి అన్నట్టుగా సైఫ్ ప్రమోషన్స్ అస్సలు చేయలేదు పైగా రిలీజ్ అయిన మొదటి రోజే తన సినిమా ఏంటో దానిని ఫలితం ఏంటో అతనికి అర్థం అయిపోయింది దాంతో ఆది పురుష్ కోసం ఒక్కరోజు కూడా ప్రమోషన్ కి రాలేదు.కానీ ఇప్పుడు సైఫ్ పద్ధతి మార్చుకొని దేవర సినిమా కోసం పూర్తిగా తన సమయానికి కేటాయిస్తున్నాడు.ముంబైలో జరిగిన దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా తాను హాజరయ్యాడు.
యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు.ఈ సినిమా తన కెరియర్ లో అత్యద్భుతంగా ఉండబోతుంది అనే సంకేతాన్ని ఇచ్చేస్తున్నాడు.
ఇది పూర్తిగా తదైనా సినిమాగా చెప్పేస్తున్నాడు.ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) డ్యూయల్ రోల్ చేస్తే తన పాత్రను ఢీకొట్టే పాత్రలతో అంతకన్నా పవర్ఫుల్ నేపథ్యంలో తన పాత్ర ఉండబోతుందని అదే సినిమాకి హైలెట్ గాఉంటుందని కూడా చెబుతున్నాడు.మామూలుగా కొరటాల శివ చిత్రం ఏదైనా సరే విలన్స్ తక్కువగా ఉంటారు.హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.కానీ ఈ సినిమాలో రెండు చాలా చక్కగా బ్యాలెన్స్ చేసినట్టుగా తెలుస్తుంది.ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడానికి ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ సిద్ధంగా లేడు.
దేవర సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆయనకు సౌత్ ఇండియాలో మరికొన్ని చాన్సులు వచ్చినప్పటికీ కూడా దేవర ఫలితం వచ్చిన తర్వాత సౌత్ సినిమాలో మళ్లీ నటించబోయేది లేనిది నిర్ణయించుకుంటాను అనే సమాధానం అతని నుంచి వచ్చిందట.