విక్రమ్‌లో యూనిక్ టాలెంట్‌.. హీరోగా క్లిక్ అవ్వక ముందు వాళ్లందరికీ డబ్బింగ్ చెప్పాడట..?

చియాన్ విక్రమ్( Chiyaan Vikram ) మామూలు టాలెంటెడ్ కాదు.యాక్టింగ్‌లో ఈ నటుడికి తిరుగులేదు.

 Hero Vikram Dubbing Works Before Acting Details, Vikram , Chiyaan Vikram, Vikram-TeluguStop.com

అయితే ఇతను యాక్టింగ్‌కే పరిమితం కాలేదు.ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా అదరగొట్టాడు.

అంతేకాదు, కెరీర్ స్టార్టింగ్‌లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసి తనలోని ఇంకో టాలెంట్‌ని బయటపెట్టాడు.కెరీర్ తొలినాళ్లలో విక్రమ్ టీవీ కమర్షియల్ యాడ్స్‌ కోసం మోడల్‌గా పనిచేశాడు.

కాస్టింగ్ డైరెక్టర్ల దృష్టిలో పడాలనే ఆశతో ఒక షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించాడు.దూరదర్శన్ సీరియల్ గలట్టా కుటుంబం (1988)తో బుల్లితెర రంగంలో కూడా అంతన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

అలా కష్టపడుతూ ఉంటే అతనికి ప్రయోగాత్మక చిత్రం ఎన్ కాదల్ కన్మణి (1990)లో హీరోగా చేసే బంపర్ ఆఫర్ వచ్చింది.ఈ మూవీలో విక్రమ్‌కు జంటగా రేఖా నంబియార్ నటించింది అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత నటించిన సినిమాలకు కూడా ఫెయిల్ అయ్యాయి.కొన్ని మామూలుగా ఆడాయి.1999లో వచ్చిన సేతు మూవీ దాకా విక్రమ్‌ బాగా స్ట్రగుల్ అయ్యాడు.అతను సినిమాలు పెద్దగా ఆడకపోయేవి కాబట్టి డబ్బులు కూడా వచ్చేవి కావు.

ఇక చేసేదేమీ లేక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారాడు.

Telugu Abbas, Ajith Kumar, Amaravati, Arjun, Chiyaan Vikram, Venkatesh, Jd Chakr

మొట్టమొదటిగా 1993లో వచ్చిన “అమరావతి” సినిమాలో అజిత్ కుమార్ కి( Ajith Kumar ) డబ్బింగ్ చెప్పాడు.అదే సమయంలో వెంకటేష్ “క్షణక్షణం” సినిమా తమిళంలో డబ్ చేశారు.ఈ తమిళ వెర్షన్‌లో హీరో వెంకటేష్( Venkatesh ) పాత్రకు విక్రమే డబ్బింగ్ చెప్పాడు.

ప్రేమదేశం మూవీ ఫేమ్ వినీత్ కి( Vineeth ) కూడా గాత్ర దానం చేశాడు.తమిళ సినిమాల్లో జయరామ్, ప్రభుదేవా, అర్జున్, అబ్బాస్, జేడీ చక్రవర్తిలకు కూడా ఆయన డబ్బింగ్ చెప్పాడు.

విక్రమ్‌ తమిళంలో అనర్గళంగా మాట్లాడగలడు.అతని వాయిస్ హీరోలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

అందుకే విక్రమ్‌ చేతనే తమిళ సినిమాల్లో హీరోలకు డబ్బింగ్ చెప్పించారు.ముఖ్యంగా అబ్బాస్ కి ( Abbas ) చాలా సినిమాలకు విక్రమ్ వాయిస్ అందించాడు.2001 వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా విక్రమ్‌ పనిచేశాడు.2024లో ఏఆర్ఎం అనే మలయాళ సినిమాకి నేరేటర్ గా వర్క్ చేశాడు.

Telugu Abbas, Ajith Kumar, Amaravati, Arjun, Chiyaan Vikram, Venkatesh, Jd Chakr

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసేటప్పుడు శంకర్ లాంటి టాలెంటెడ్ దర్శకులతో అతనికి పరిచయం ఏర్పడింది.అలాగే డైలాగ్స్ ఎలా చెప్పాలో, డబ్బింగ్ అనేది ఎంత కీలకమో అతనికి బాగా అర్థం అయ్యింది.డబ్బింగ్ వల్ల అతను ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతకగలిగాడు.డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేయడం అతని కెరీర్ లో చాలా పెద్ద ప్లేస్ అయిందని అంటారు.ఇప్పటికీ ఈ హీరో డబ్బింగ్ పై చాలా ఫోకస్ పెట్టి తన సినిమాలకు అద్భుతంగా వాయిస్ అందిస్తుంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube