సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.హీరోయిన్లకు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ లైఫ్ టైం ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.
అందుకే వారు తమ కెరియర్ ని కాపాడుకోవడం కోసం కొన్ని సార్లు సాహసాలు కూడా చేస్తూ ఉంటారు.ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా వరుసగా సినిమాలు కనుక చేయకపోతే ప్రేక్షకులు వారిని మరిచిపోతారు.
అందుకే సెలబ్రిటీలు తరచూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్స్ అయిన సమంత( Samantha ) రష్మిక( Rashmika ) వంటి వారు అభిమానులను కాస్త నిరుత్సాహ పరుస్తున్నారు.సమంత చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాదిన్నర అవుతున్న ఇప్పటివరకు ఒక సినిమా కూడా విడుదల కాలేదు.
ఇక రష్మిక పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.ఇకపోతే వీరిద్దరి సినిమాలు చాలా కాలం నుంచి రాకపోవడంతో ఈ ఇద్దరు హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూ వస్తున్నారు.
సోషల్ మీడియాలో( Social Media ) ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు వారి లేటెస్ట్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇటీవల సమంత తన ఫ్యామిలీతో కలిసి తన సోదరుడి వివాహ వేడుకలలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి.మరోవైపు రష్మిక సైతం సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే వీరిద్దరూ నటిస్తున్న సినిమాలు ఇప్పట్లోనే విడుదలకు నోచుకోలేకపోతున్న తరుణంలోనే వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతూ వస్తున్నారు.
ఇక త్వరలోనే రష్మిక నటించిన పుష్ప 2( Pushpa 2 )సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.