అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే.అధ్యక్ష ఎన్నికల వేళ ఆయన పర్యటన అగ్రరాజ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ట్రంప్‌ను( Trump ) కలవకుండా మోడీ అమెరికాను వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది.ట్రంప్‌ను మోడీ కలవరని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ముందే క్లారిటీ ఇచ్చారు.
అయినప్పటికీ ట్రంప్‌తో మోడీ భేటీ అవుతారని అమెరికన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అమెరికా పర్యటన సందర్భంగా విల్మింగ్టన్లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు( Quad Leaders Summit ) మోడీ హాజరయ్యారు.అనంతరం లాంగ్ ఐలాండ్‌లో వేలాది మంది భారతీయులు పాల్గొన్న ఈవెంట్లో ప్రధాని ప్రసంగించి, యూఎస్ టెక్ దిగ్గజాలను కలుసుకున్నారు.సోమవారం ఐక్యరాజ్యసమితి ఫ్యూచర్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన అమెరికాలో( America ) ఉన్నన్ని రోజులు క్షణం తీరిక లేకుండా గడిపారు.
ఇదే సమయంలో డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లను కలవకూడాదని మోడీ నిర్ణయించారు.తన మిత్రుడు మోడీ తనను కలవడానికి వస్తాడని ట్రంప్ ఇప్పటికే తన ఎన్నికల ప్రచార సభల్లో డబ్బా కొట్టడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది
ట్రంప్ – మోడీ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే.ట్రంప్ అమెరికా ఫస్ట్, మోడీ మేక్ ఇన్ ఇండియా ప్రచారాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి.ముఖ్యంగా 2019లో అధ్యక్ష ఎన్నికలకు ముందు హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ ర్యాలీలో వారి అనుబంధం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఆ సమయంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు.నాడు ప్రవాస భారతీయులను ఉద్దేశిస్తూ.అబ్కీ బార్ , ట్రంప్ సర్కార్ (ఈసారి ట్రంప్ ప్రభుత్వం) అని మోడీ నినాదం చేశారు.
ఆ తర్వాత 2020లో అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్‌కు మోడీ ఆతిథ్యం ఇచ్చారు.
నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సభకు లక్ష మందికి పైగా జనం వచ్చారు.ఈ ఘటనలను మోడీ తన ఎన్నికల సభల్లో గర్వంగా చెప్పుకున్నారు.కానీ ఈసారి మాత్రం మోడీ నుంచి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అనే మాటలు రాకపోవడం మాజీ అధ్యక్షుడిని షాక్‌కు గురిచేసింది.