సినీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) ఇంట్లో తాజాగా దొంగతనం జరిగింది.అయితే ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.
నిత్యం ఎంతోమంది వర్కర్స్ తిరుగుతూ ఉండే ఇంట్లో ఇలా దొంగతనం జరిగిందనే విషయం తెలియడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.జల్ పల్లిలో మోహన్ బాబుకి ఒక అందమైన ఫామ్ హౌస్ ఉంది.
ఈ ఫామ్ హౌస్ అచ్చం ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది.అయితే లక్ష్మీ మంచు( Manchu Lakshmi ) తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో కూడా చేశారు.
ఈ ఇంట్లోనే ఇటీవల దొంగతనం జరిగిందనే విషయం తెలుస్తుంది.అయితే మోహన్ బాబు ఇంట్లో దొంగతనానికి పాల్పడింది మరెవరో కాదని తన ఇంట్లో నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఈ దొంగతనం చేశారని విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.మోహన్ బాబు ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్న నాయక్ అనే వ్యక్తి , ఇంట్లో ఎవ్వరూ లేని సమయాన్ని చూసి 10 లక్షల రూపాయిలను దొంగతనం చేసి పరార్ అయ్యారు.
ఇలా దొంగతనం జరిగిందనే విషయాన్ని గుర్తించడం మోహన్ బాబు మంగళవారం రాత్రి రాచకొండ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసాడు.ఇలా మోహన్ బాబు నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే నాయక్( Nayak ) తిరుపతిలో పోలీసులకు దొరికిపోయారు.సాధారణంగా మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరు అని చెబుతారు.
ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తనతో పాటు ఉండే వాళ్ళు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటారు.ఎవరైనా తప్పు చేస్తే వారికి చాలా కఠినమైన శిక్ష విధిస్తారనే సంగతి కూడా తెలిసిందే ఇలా పద్ధతికి క్రమశిక్షణకు మారుపేరు అయినటువంటి మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి దొంగతనం జరిగిందనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.