వరుసగా నాలుగు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న కొరటాల శివకు ఐదో సినిమా ఆచార్య భారీ షాక్ ఇచ్చింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
అయితే కొరటాల శివ ఆచార్య సినిమా స్టార్ట్ కావడానికి ముందే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు దేవర స్టోరీ లైన్ చెప్పానంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేయగా ఆ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ ( Allu Arjun )తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో మిర్చి సినిమా చూశాడని మిర్చి నుంచి బన్నీతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నానని ఆ సినిమా త్వరలోనే వస్తుందని నమ్ముతున్నానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.నా దగ్గర ఉన్న ప్రతి లైన్ జూనియర్ ఎన్టీఆర్ తో పంచుకుంటానని ఆయన తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ కు చిన్నచిన్న కథలు కూడా ఎంతగానో నచ్చుతాయని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
గతంలో తాను తయారు చేసిన కథలలో దేవర లేదని ఈ సినిమా కథను కొత్తగా తయారు చేశానని కొరటాల శివ పేర్కొన్నారు.సెన్సార్ తర్వాత పాట ప్లేస్ మెంట్ మార్చాం తప్ప సినిమాను ట్రిమ్ చేయలేదని ఆయన కామెంట్లు చేస్తున్నారు.సినిమాలో సొరచేప సీన్ వెనుక ముఖ్యమైన కారణం ఉందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.దేవర మూవీలో ప్రతి రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.
మిర్చి తర్వాత ప్రభాస్( Prabhas) డేట్లు దొరక్కపోవడం వల్ల తమ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదని ఆయన పేర్కొన్నారు.దేవర సినిమాకు సౌండింగ్ కీలకం కావడంతో అనిరుధ్ ను ఎంపిక చేయడం జరిగిందని కొరటాల శివ వెల్లడించారు.
దర్శకుడు కొరటాల శివ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.