తమిళ్ సినిమా హీరో అయిన విజయ్( Hero Vijay ) తెలుగులో సక్సెస్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు.అయినప్పటికీ ఆయనకు తెలుగులో మాత్రం మంచి విజయం అయితే దక్కడం లేదు.
ఇక ఇప్పటికి ఆయన చేసిన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారనే చెప్పాలి.ఇక ఆయన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆయన్ని ఆదరించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఇక విజయ్ నటన ఎలా ఉన్నా కూడా ఆయన తమిళంలో సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి విజయ్ ఇప్పుడు పార్టీ పెట్టి రాజకీయంగా కూడా రాణించడానికి ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి విజయ్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ప్రస్తుతం తన చివరి సినిమాని( Vijay Last Movie ) చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన ‘గోట్ ‘ సినిమా( GOAT Movie ) ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది.తెలుగు ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఏ మాత్రం మెప్పించకపోగా ఆయనకి భారీగా డామేజ్ నైతే చేసింది.
ఇక ఇప్పటివరకూ ఎంతో కొంత విజయ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా భారీ డిజాస్టర్ అందించడమే కాకుండా ఆయనకు చాలా పెద్ద దెబ్బ కొట్టిందనే చెప్పాలి.మరి చివరి సినిమాతో అయిన విజయ్ తెలుగులో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మీదట ఆయన సినిమాలు చూసే అవకాశం లేదు.కాబట్టి చివరి సినిమాతో తప్పకుండా సక్సెస్ ని సాధించి తన కోరికను తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.చూడాలి మరి విజయ్ అనుకున్నట్టుగానే ఇక్కడ ఆయనకు సక్సెస్ దక్కుతుందా లేదా అనేది…
.