ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి( Harsha Sai ) గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.అయితే కొద్దీ రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయాలతో వార్తలలో నిలవగా.
, తాజగా ఆయన మరో కేసులో ఇరుక్కున్నాడు.ఈ కేసులో మరొక కీలక ట్విస్ట్ బయటపడింది.
మొన్నటికి మొన్న బెట్టింగ్స్ యాప్స్ విషయంలో పలు వివాదాలు ఎదుర్కొన్న హర్ష తాజాగా రేప్ కేసు విషయంలో రోడ్డుకెక్కవలసి వచ్చింది.ఇకపోతే జనాల్లో విపరీతంగా ఫాలోయింగ్ వచ్చాక హర్ష సాయి ఓ సినిమా కూడా తీయడం జరిగింది.
అయితే ఎందుకో మరి, ఆ సినిమా విడుదల ఇంకా నోచుకోలేదు.కాగా.
, ఆ సినిమా హర్ష సొంత దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం మరో విశేషం.ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో కూడా హర్ష పేదవారికి సేవ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా ఓ నటి హర్షపైన రేప్ కేసు వేయగా ప్రస్తుతం తెలుగు మీడియా ఈ విషయం చుట్టూనే తిరుగుతోంది.నార్సింగ్ పీఎస్‌లో కంప్లైంట్‌తో హర్ష సాయి డర్టీ పిక్చర్ కాస్త రచ్చకెక్కింది.హర్షసాయి తనను పెళ్లి చెప్పి నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది.ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు తెలిపింది.
తన దగ్గర 2 కోట్ల రూపాయిలు తీసుకొని.ఇప్పుడు ఆయన ముఖం చాటేస్తున్నాడని అడ్వొకేట్‌తో కలిసి నార్సింగి పీఎస్‌లో కంప్లేంట్ చేశారామె.
అలాగే ఆమె పర్సనల్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ, మరిన్ని డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నాడని కూడా ఆరోపించింది.ఈ నేపథ్యంలో హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణ( Radhakrishna )పై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
అయితే తాజాగా ఈ విషయంపై యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.డబ్బులు కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు హర్ష సాయి.నా గురించి మీకు తెలుసు.నిజ నిజాలు త్వరలో బయటకు వస్తాయి.నా తరపు న్యాయవాది దీని గురించి త్వరలో మీ ముందుకు వస్తారంటూ పోస్ట్ చేసాడు హర్షసాయి.చుడాలిమరి ముందు ముందు ఎలాంటి నిజానిజాలు బయటికి వస్తాయో.