నల్ల మిరియాలు( Black Pepper ).ఇండియన్ స్పైసెస్ లో ఇవి చాలా ప్రత్యేకమైనవి.
నల్ల మిరియాలు మసాలా దినుసుల్లో రారాజు గా పిలవబడతాయి.ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే నల్ల మిరియాలను వంటల్లో విరివిరిగా వాడుతుంటారు.
నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.దగ్గు, జలుబు నివారణలో, జీర్ణక్రియ పనితీరులో సహాయపడతాయి.
అనేక అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.అయితే ఆరోగ్యపరంగా మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం నల్ల మిరియాలు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా చుండ్రు సమస్యను కేవలం ఒక్క వాష్ లోనే పోగొట్టే సత్తా నల్ల మిరియాలకు ఉంది.మరి చుండ్రును పోగొట్టుకోవాలంటే నల్ల మిరియాలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ( Mustard Oil )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక అదిరిపోయే హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.
ఈ టానిక్ ను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.నల్ల మిరియాల్లో విటమిన్ సి ( Vitamin C )పుష్కలంగా ఉంటుంది.ఇది చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
స్కాల్ప్‌ను హెల్తీగా మారుస్తుంది.అలాగే ఉల్లిపాయ, ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ కూడా చుండ్రును వదిలించడానికి సహాయపడతాయి.
ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని కనుక పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్న సరే మాయం అవుతుంది.అంతేకాకుండా ఈ రెమెడీని పాటించడం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మరియు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.