ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు గురించి భారతదేశ వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇందులో భాగంగా.
జగన్ ప్రభుత్వంలో తిరుమల లడ్డు( Tirumala Laddu ) సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందని ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు లడ్డు వివాదంపై అనేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా టాలీవుడ్ సినీ ప్రముఖులలో ఒకరైన నటుడు ప్రకాష్ రాజ్ ఈ విషయంపై కాస్త పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) విమర్శిస్తూ చేసిన కామెంట్స్ హార్ట్ టాపిక్ గా మారడంతో ఆయనపై పలువురు విడుచుకపడ్డారు.
ఇకపోతే తాజాగా ఈ సంఘటనకు సంబంధించి కోలీవుడ్ నటుడు హీరో కార్తీ( Hero Karthi ) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు తెలియజేశారు.సోషల్ మీడియా వేదికగా ఆయన క్షమాపణలు తెలియజేశారు.సోషల్ మీడియా పోస్టులో కార్తీ.
తాను చేసిన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడిందని దానిపై తాను క్షమాపణ కోరుతున్నట్లు తెలియజేశాడు.తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడనని తెలుపుతూ.
ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్.నా వ్యాఖ్యల వల్ల అనుకొని ఆపార్థం ఏర్పడినందున నేను క్షమాపణలు తెలుపుతున్నానని.
నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు మన సాంప్రదాయాలు గౌరవిస్తానంటూ ఆయన రాసుకొచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా హీరో కార్తీ నటిస్తున్న సినిమా “సత్యం సుందరం”( Sathyam Sundaram Movie ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన నేపథ్యంలో లడ్డు కావాలా నాయనా.ఇంకో లడ్డు కావాలా నాయనా.అని యాంకర్ ప్రశ్నించగా.అందుకు, కార్తీక్ స్పందిస్తూ ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు.ఆ టాపిక్ చాలా సెన్సిటివ్.మనకు వద్దు అంటూ నెమ్మదిగా తోసుకొచ్చారు.
అయితే ఈ విషయాన్ని కూడా కాస్త సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.లడ్డు మీద జోకులు వేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
ఈ సందర్బంగా తాను నిన్న సినిమా ఫంక్షన్ చూశాను లడ్డు చాలా సెన్సిటివ్ అని అన్నారని.లడ్డు టాపిక్స్ సెన్సిటివ్ కాదు.
దయచేసి ఎవరు అలా అనుకోవద్దంటూ పవన్ పేర్కొన్నారు.